స్థానిక ఎన్నికల నిర్వహణ మీద స్టే ఇవ్వడం లేదు..కేవలం రిజర్వేషన్ల పెంపు జీఓల మీద మాత్రమే స్టే ఇస్తున్నాం – ఆర్డర్ కాపీలో హైకోర్టు..!.
స్థానిక ఎన్నికల నిర్వహణ మీద స్టే ఇవ్వడం లేదు.
కేవలం రిజర్వేషన్ల పెంపు జీఓల మీద మాత్రమే స్టే ఇస్తున్నాం – ఆర్డర్ కాపీలో హైకోర్టు.
_• పాత రిజర్వేషన్లకు అనుగుణంగా పెంచిన బీసీ సీట్లను ఓపెన్ కేటగిరీగా ( జనరల్) ప్రకటించి ఎన్నికలు నిర్వహించవచ్చు -హైకోర్టు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 పై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇటీవల విడుదలైన నోటిఫికేషన్పై వివిధ పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లు తమ వాదనలో ప్రభుత్వ జీవో ద్వారా ఎన్నికల ప్రక్రియలో అన్యాయం జరుగుతోందని.. కొన్ని వర్గాలకు అనుకూలంగా మార్పులు జరిగాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రాథమిక విచారణ జరిపిన హైకోర్టు, జీవో నంబర్ 9( బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన) అమలుపై Stay విధించింది. అంతే కాకుండా.. ఈ రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి విడుదలైన నోటిఫికేషన్పై కూడా స్టే విధించింది హైకోర్టు..