ఒంటరిగా గడిపేందుకు ఫారెస్ట్‌కి వెళ్లిన ప్రేమజంట..జంటకు ఊహించని షాక్..

పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో నిర్మాణుష్య ప్రాంతంలో జరిగిన ఈప్రమాదం అందర్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. పట్టణానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి కాసేపు గడుపుదామని వెళ్లిన జంటకు ఊహించని షాక్ ఎదురైంది. అడవిలోని చెట్ల మధ్యలో ఒకరి పక్కన మరొకరు యువతి, యువకుడు కూర్చొన్న సమయంలో కరెంట్ తీగలు తగాలి. ఈఘటనలో ప్రియుడు ఫయాజ్ అనే యువకుడికి తీవ్రగాయాలవగా.. అతని ప్రియురాలికి స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే కరెంట్ తీగ తగిలిన వెంటనే షాక్ తగలడంతో గట్టిగా కేకలు వేయడంతో అడవిలో పశువుల కాపర్లు వీరి అరుపులు విని పోలీసులకు సమాచారం అందించారు. ఈఘటన కదిరి మండలం బత్తలపల్లి తండాలో చోటుచేసుకుంది.
సరదాగా మాట్లాడుకోవడం, ఏకాంతంగా గడిపేందుకు గతంలో ప్రేమ జంటలు పార్కులు, సినిమా థియేటర్లకు వెళ్లేవారు. ఇప్పుడు ట్రెండ్ మారడంతో నిర్మాణుష్య ప్రదేశం, టూరిస్టు స్పాట్‌లతో పాటు ఫారెస్ట్ ఏరియాలకు వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాల్లో ఉండే యువతి, యువకులు తమకు నచ్చిన వాళ్లతో కాస్త ఫ్రీగా ఉండేందుకు చుట్టుపక్కల ఉండే అటవీ ప్రాంతాలకు వెళ్తున్నారు. పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో ఫయాజ్ అనే యువకుడు ప్రియురాలితో కలిసి కదిరి మండలం బత్తలపల్లి తాండా అటవీ ప్రాంతానికి వెళ్లారు.