టిమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ అరుదైన రికార్డు…!

టిమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో రెండువందల వికెట్ల కబ్‌లోకి అడగుపెట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన అనంతరం షమీ ఈ ఘనత సాధించాడు..ఈ మ్యాచ్‌లో షమీ.. సౌమ్య సర్కార్‌, మెహిదీ హసన్ మిరాజ్‌లతో పాటు జాకీర్ అలీ వికెట్ పడగొట్టిన క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) రెండు వందల వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు అజిత్ అగార్కర్‌, జహీర్ ఖాన్ రికార్డులకు బ్రేక్ చేశాడు. అజిత్ అగార్కర్ 133 ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో రెండు వందల వికెట్లు తీయగా షమీ కేవలం 103 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 200 వికెట్లు తీసిన భారత బౌలర్లు..

మహ్మద్ షమీ – 103 ఇన్నింగ్స్‌లు
అజిత్ అగార్కర్ -133 ఇన్నింగ్స్‌లు
జహీర్ ఖాన్ – 144 ఇన్నింగ్స్‌లు
అనిల్ కుంబ్లే – 147 ఇన్నింగ్స్‌లు
జవగల్‌ శ్రీనాథ్ – 147 ఇన్నింగ్స్‌లు
కపిల్ దేవ్ – 166 ఇన్నింగ్స్‌లు

IND vs BAN..

ఇక ఓవరాల్‌గా ఈ ఘనత చూసుకుంటే.. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా షమీ నిలిచాడు. ఈ క్రమంలో అతడు పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు సక్లైన్ ముస్తాక్ రికార్డును సమం చేశాడు. సక్లైన్, షమీలు ఇద్దరూ 104 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అగ్రస్థానంలో ఉన్నాడు. 102 వన్డేల్లోనే స్టార్క్ ఈ ఘనత సాధించాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..

మిచెల్‌ స్టార్క్‌(ఆస్ట్రేలియా) – 102 మ్యాచ్‌లు
సక్లైన్ ముస్తాక్ (పాకిస్థాన్) – 104 మ్యాచ్‌లు
మహ్మద్ షమీ (భారత్) – 104 మ్యాచ్‌లు
ట్రెంట్‌ బౌల్ట్ (న్యూజిలాండ్‌) – 107 మ్యాచ్‌లు
బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) – 112 మ్యాచ్‌లు
అలన్‌ డొనాల్డ్ (దక్షిణాఫ్రికా) – 117 మ్యాచ్‌లు

అతి తక్కువ బంతుల్లో తీసిన బౌలర్‌గా..

వన్డేల్లో బంతుల పరంగా చూసుకుంటే షమీనే అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో మిచెల్ స్టార్క్‌ను అధిగమించాడు. 5420 బంతుల్లో స్టార్క్ ఈ మైలురాయిని చేరుకోగా 5126 బంతుల్లోనే షమీ ఈ ఘనత సాధించాడు. వీరిద్దరి తరువాత సక్లైన్ ముస్తాక్‌, బ్రెట్‌లీ లు ఉన్నారు.

5126 – మహ్మద్ షమీ (భారత్)
5240 – మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
5451 – సక్లైన్ ముస్తాక్ (పాకిస్థాన్)
5640 – బ్రెట్ లీ (ఆస్ట్రేలియా)
5783 – ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్‌)
5883 – వకార్ యూనిస్ (పాకిస్థాన్)

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..

అనిల్ కుంబ్లే – 334 వికెట్లు
జవగళ్ శ్రీనాథ్ – 315 వికెట్లు
అజిత్ అగార్కర్ – 288 వికెట్లు
జహీర్ ఖాన్ – 269 వికెట్లు
హర్భజన్ సింగ్ – 265 వికెట్లు
కపిల్ దేవ్ – 253 వికెట్లు
రవీంద్ర జడేజా – 226 వికెట్లు
మహ్మద్ షమీ – 202* వికెట్లు

ఇక ఈ మ్యాచ్‌లో షమీ 10 ఓవర్లు వేసి 53 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు.