హిమాలయాలకు వెళ్లిపోతావా..?

హిమాలయాలకు వెళ్లిపోతావా..?

పవన్‌తో మోదీ: ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రధాని మోదీ స్టేజీపైనే ముచ్చటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మోదీ తనతో ఏం మాట్లాడారని మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానమిచ్చారు. ‘ప్రధాని నాతో చిన్న జోక్ చేశారు. ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలి అనుకుంటున్నావా? అని అడిగారు. అందుకు ఇంకా చాలా టైమ్ ఉందని,నువ్వు చేయాల్సిన పని చెయ్యు’అని చెప్పారని పవన్ తెలిపారు