మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల up date..

మహారాష్ట్రలో ముందంజలో ఎన్టీఏ కూటమి.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌పై శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ స్పందించారు. ఇది మహారాష్ట్ర ప్రజల నిర్ణయం కాదనీ, బీజేపీ ఫౌల్ ప్లే అని ఆరోపించారు.

23 Nov 24 · 11:08 AM.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి స్పష్టమైన ఆధ్యిక్యంలో కొనసాగతుంది. బీజేపీ 125, శివసేన (శిందే) 57. ఇండియా కూటమి కాంగ్రెస్ 20, శివసేన యూబీటీ 19 స్థానాల్లో ముందంజలో ఉంది.

23 Nov 24 · 11:06 AM.

10.34.am..
పోస్టల్ బ్యాలెట్ మొదటి ట్రెండ్స్‌లో MVA ముందంజలో ఉంది. అయితే అరగంటలో మహాయుతి ఆధిక్యంలోకి వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ముగిసి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. మహాయుతి ప్రస్తుతం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మెజారిటీ మార్కును (145) దాటి 176 స్థానాల్లో దాడి లీడ్ కొనసాగుతుండటం విశేషం..

మహారాష్ట్రలో.

మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) మధ్య గట్టి పోటీ నెలకొంది. మహాయుతి కూటమి విషయానికి వస్తే.. 149 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీలో నిలుపగా, శివసేన (ఏక్‌నాథ్‌ షిండే) 81 స్థానాల్లో, ఎన్‌సీపీ(అజిత్‌ పవార్‌) 59 స్థానాల్లో అభ్యర్థులను నిలిపారు. ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ 101 మంది అభ్యర్థులను నిలబెట్టగా, శివసేన (యూబీటీ) 95 స్థానాల్లో, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ 86 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) 237 స్థానాల్లో పోటీ చేయగా, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇలా.. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలకు 4,136 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ నెల 20న పోలింగ్ జరగగా.. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

రెండు కూటమిల పాలనను…మహారాష్ట్రలో రెండు కూటమిల పరిపాలనను ప్రజలు చూశారు. తొలుత కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాక్రే), ఎన్సీపీ పాలనను చూశారు. తర్వాత బీజేపీ, శివసేన ( ఏక్ నాధ్ షిండే) కూటమి పాలన కూడా మరాఠా ప్రజలు చూశారు. రెండు కూటముల పాలనను బేరీజు వేసుకుని ఈ ఎన్నికల్లో ఓటర్లు తీర్పు చెప్పినట్లే కనిపిస్తుంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 145 గా ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో గెలవాలంటే కనీసం 150కి పైగా స్థానాలను దక్కించుకోవాల్సి ఉంది. ఎర్లీ ట్రెండ్స్ మాత్రం బీజేపీ కూటమికి అనుకూలంగా కనిపిస్తున్నాయి..