విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్.. థింఫులో భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గేకు 54 మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ (XEV 9e) ఎలక్ట్రిక్ కార్లను అందజేశారు..దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
జైశంకర్ రెండు రోజుల భూటాన్ పర్యటన సందర్భంగా.. ఈ వాహనాలను అప్పగించారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి, ఇతర సీనియర్ నాయకులతో ఇంధనం, కనెక్టివిటీ.. విస్తృత ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. 54 ఎలక్ట్రిక్ వాహనాలను అప్పగించడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని, ఈ-మొబిలిటీ.. సుస్థిర రవాణా రంగాలలో భూటాన్ సాధిస్తున్న పురోగతికి భారతదేశం మద్దతు ఇస్తోందని డాక్టర్ జైశంకర్ సోషల్ మీడియాలో తెలిపారు.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ.
ఎక్స్ఈవీ 9ఈ అనేది మహీంద్రా కంపెనీకి చెందిన ప్రత్యేకమైన INGLO ఆర్కిటెక్చర్‌పై నిర్మితమయ్యాయి. ఇది ప్రత్యేకంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడళ్ల కోసం రూపొందించిన టెక్నాలజీ. ప్యాక్ టూ వేరియంట్ 59 కిలోవాట్ LFP బ్యాటరీ ప్యాక్‌ను.. వెనుక యాక్సిల్‌పై అమర్చిన ఒకే ఒక పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ను ఉపయోగిస్తుంది. ఇది దీనిని రియర్ వీల్ డ్రైవ్ SUVగా చేస్తుంది.