పాక్ ఆర్మీ, ఖైబర్ ఫఖ్తుంఖ్వా పోలీసుల మధ్య తీవ్రమైన ఘర్షణ…. ఆ దేశ ఆర్మీ జవాన్లకు, పోలీసులకు మధ్య గొడవ..!.
పాక్ అంతర్గత పరిస్థితులు కూడా ఆశాజనకంగా లేవు. బలూచిస్తాన్లో బీఎల్ఏ, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబాన్ల దెబ్బకు పాక్ సైన్యం తోకముడుస్తోంది. పాక్ సైన్యంలో పంజాబ్ ఆధిపత్యాన్ని ఇతర ప్రాంతాలు సహించడం లేదు..
ఇదిలా ఉంటే, తాజాగా పాక్ ఆర్మీ, ఖైబర్ ఫఖ్తుంఖ్వా పోలీసుల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. లక్కీ మార్వాట్లోని పష్తూన్ పోలీసు అధికారులు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ని పోలీస్ స్టేషన్లోకి రానివ్వలేదు. పోలీస్ అధికారులు ఆర్మీపైకే ఆయుధాలు ఎక్కుపెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ పహల్గాం దాడి తర్వాత నుంచి కనిపించకుండా పోయిన నేపథ్యంలో ఆయనను ఉద్దేశించి కూడా పోలీసులు తీవ్ర వ్యాఖ్యలు చేయడం వీడియోలో కనిపిస్తోంది.
Major face-off between Pakistan Army and Pakistani Police breaks out.
”మీ దిమాక్ సరిగా పనిచేయడం లేదు. వారిని కాశ్మీర్ పంపండి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. మీ జనరల్(ఆసిమ్ మునీర్) వచ్చినా, ఏం చేయలేడు. మేం లక్కీ మార్వాట్ పోలీస్ గుర్తుంచుకోండి. ఈ పంబాబ్ వాళ్లు ఇక్కడి వచ్చి నాటకాలు చేస్తున్నారు” అని అనడం వీడియోలో చూడవచ్చు. ఈ సంఘటన పాకిస్తాన్లోని అంతర్గత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చెబుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో విస్తృతంగా వైరల్ అవుతోంది…. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి కూడా పాక్ పరిస్థితి ఏంటో అర్థం అయిపోతుంది.
https://x.com/AdityaRajKaul/status/1917554429206880376?t=egPQxZDYSoEsDPxY4CxkFw&s=19