మాక్ అసెంబ్లీలో టీ బ్రేక్..
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ మాక్ అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించారు. ఈ సందర్భంగా సీఎం పాత్ర పోషించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, హామీల అమలుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు..
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ మాక్ అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శాసన సభ స్పీకర్‌గా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ సభ్యులు సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు..
తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి పాత్రలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “మాకు బ్యాంకు చెక్కులు అంటే అర్థమవుతుంది.. కానీ క్యూసెక్కులు అంటే మాకు అర్థం కాదు” అంటూ సాగునీటి శాఖ పనితీరుపై సెటైర్ వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని, అందుకే తాము ఆ పని చేయబోమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు…
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలోని సాగునీటి పరిస్థితులు గణనీయంగా మారాయని అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం నీటిని అక్రమంగా తరలించారని విమర్శించారు…బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని జగదీశ్‌రెడ్డి అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను నింపామని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..
ఏదైనా చర్చలు, సెటిల్మెంట్లతోనే సాధ్యం అవుతుందని మా ముఖ్యమంత్రి చెప్పాడు అధ్యక్ష
22-Aలో భూములు ఉన్నవాళ్లు ఎప్పుడైనా వచ్చి సెటిల్మెంట్లు చేసుకోవచ్చు
మరీ 30% కాకపోయినా ఎంతో కొంత ఇవ్వొచ్చు
వెలుగుమట్లలో మా ధనికుల ఇళ్ల పక్కన ఎస్సీ, ఎస్టీ వాళ్ల ఇళ్లు ఉన్నాయని కూలగొట్టాం అధ్యక్ష
* మాక్ అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి అలియాస్ గంగుల కమలాకర్..
మా ఉత్తమ్ అన్నను, కాంగ్రెస్ పార్టీని తొక్కుకుంటూ ఈ స్టేజ్‌కి వచ్చిన అధ్యక్ష
నాకు ముఖ్యమంత్రి అండ ఉంది.. మేము ఉచితాలకు వ్యతిరేకం అధ్యక్ష.. మాక్ అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి అలియాస్ గంగుల కమలాకర్..
హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకొని వచ్చి మీకు నేర్పిద్దాం అనుకున్న
పేగులు తీసి మెడల వేసుకొని అని మళ్లీ నా పాత భాషను మొదలు పెట్టాలా?.
విమానం దిల్‌సుఖ్‌నగర్‌లో తయారు కాకపోతే మీ కోరుట్లలో అవుతద?
నాకున్న పరిజ్ఞానంతో మా వాళ్లు చెప్పింది చెప్తున్న అధ్యక్ష…
నా రియల్ ఎస్టేట్ దందా బంద్ చేసి ఐటీ తెమ్మంటున్నారు, ఇండస్ట్రీస్ తెమ్మంటున్నారు
ఇదేం పద్దతి అధ్కక్షా
కోకాపేట్, శంకర్పల్లి, లింగంపల్లి, గండిపేట ఏరియాల్లో అడగండి నేనెంత పెద్ద రియల్ ఎస్టేట్ చేశానో చెప్తారు..
భూముల రేట్లు ఎలా పెంచాలి, భూములను మా కుటుంబ సభ్యులకు ఎలా పంచాలి అని నేను చూస్తుంటే ఉద్యోగాలు ఇవ్వమని అంటున్నారు..
సరదాగా…మాక్ అసెంబ్లీలో పండవెట్టి తొక్కుతా అన్న సీఎం
సీఎం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన..
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆలా ఎలా మాట్లాడతారు అంటూ ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ సభ్యులు.
మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అలియాస్ తలసాని శ్రీనివాస్ యాదవ్
స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, క్యాబ్‌లపై ఆధారపడి చాలా మంది బండ్లు కొంటున్నారు..
దీని వల్ల హైదరాబాద్‌లో గాలి కాలుష్యం ఎక్కువ అవుతుంది..- కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్..
సస్పెన్షన్లపై చురకలు..
మాక్ అసెంబ్లీ సందర్భంగా తలసాని మాట్లాడూ, “కొండా సురేఖ బిడ్డ నా గురించి మాట్లాడింది కాబట్టే ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు ఉండి తొక్కి వచ్చాను. ముఖ్యమంత్రినైన నన్ను, అదీ ఓ బీసీ బిడ్డను బర్తరఫ్ చేయక ఏం చేయాలి? కేబినెట్లో వేరే వాళ్లు కూడా ఉన్నారుగా.. కొండా సురేఖ బిడ్డ వాళ్ల గురించి కూడా మాట్లాడొచ్చుగా” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అనంతరం బీఆర్ఎస్ మహిళా నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “సబితక్క సునీతక్క అంటే నాకు ఎంతో గౌరవం. కానీ, మీరు ఇవన్నీ సభలో ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశాను” అంటూ సటైరికల్‌గా ప్రభుత్వంపై పంచులు వేశారు. సభలో ప్రజా సమస్యలను లేవనెత్తకుండా ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తూ, మంత్రులు తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఈ మాక్ అసెంబ్లీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సభను ఏకపక్షంగా నడిపిస్తున్నారని, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకలను భయపెట్టలేరని ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.