మంచిర్యాల: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి వినూత్న శిక్ష..

మంచిర్యాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ 27 మందికి జడ్జి గురువారం వినూత్న శిక్ష వేశారు. వారం రోజులపాటు స్థానికంగా ఉన్న మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని స్థానిక కోర్టు జడ్జి తీర్పునిచ్చారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వారితో గురువారం పారిశుద్ధ్య పనులు చేయించారు. వారంతా గడ్డిని తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…

డ్రంక్‌డ్రైవ్‌లో చాలామంది పట్టుబడుతున్నారు. ఇందులో మైనర్లతో పాటు మహిళలు కూడా మేం తక్కువ కాదు అన్నట్టుగా పోటీపడుతున్నారు. అయితే, వీరికి జరిమానా విధించడం, జైళ్ళలో పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని భావించింన న్యాయస్థానం వారికి ఊహించని శిక్ష వేసింది. అందుకే ఈసారి ఏకంగా వారికి సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా శిక్షలను వేయాలనుకుంది కోర్టు. జైలు శిక్షలతోను, జరిమానాలతోను మానసిక పరివర్తన తీసుకురావడం కష్టమని భావించిన కోర్టు ఈసారి మందుబాబులకు సామాజిక శిక్ష విధించింది..పీకల దాకా ఫుటుగా మద్యం తాగిన మందుబాబులకు మంచిర్యాల జిల్లా కోర్టు ఓ ఆశ్చర్యకరమైన శిక్ష విధించింది. ప్రస్తుతం అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల మాతా శిశు ఆస్పత్రిని క్లీన్ చేయాలంటూ కోర్టు ఆదేశించింది. మంచిర్యాల జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 27 మంది మందు బాబులకు వారం రోజులపాటు మాతా శిశు ఆసుపత్రిని శుభ్రం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి ఉపనిషద్విని. కోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల పాటు ఆస్పత్రిని శుభ్రం చేసేందుకు మందుబాబులను తరలించారు ట్రాఫిక్ పోలీసులు..