మార్చి 16 నుంచి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

మార్చి 16 నుంచి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

*• మార్చి 16 న గవర్నర్ ప్రసంగం, 20 న రాష్ట్ర బడ్జెట్.*

*• మార్చి 16న రాజ్యసభ ఎన్నికలు*

*• ఎన్నికలు జరగాల్సి వస్తే పోలింగ్ కు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండేలా చర్యలు.

సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇకపై టీవీవీపీ ఉద్యోగులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. దానితో పాటు హైదరాబాద్‌ మెట్రోను ప్రస్తుతం నిర్వహిస్తున్నా L అండ్ T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాని నిర్ణయం తీసుకన్నారు.
అంతే కాకుండా ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయింపు నిర్ణయం తీసుకుని ఆమోదం కూడా తెలిపారు. దీనితో పాలు ప్రతి జిల్లాలో కాంగ్రెస్‌ ఆఫీసుల నిర్మాణం కోసం భూకేటాయింపులు చేయాలని నిర్ణయం తీసుకన్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో JNTU కాలేజీ నిర్మాణానికి 70 ఎకరాల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు.

దీనితో పాటు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. మార్చి 16న గవర్నర్ ప్రసంగం, 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉండనుంది, ఇక మార్చి 19న అసెంబ్లీ ఉగాది సెలవు ఉండ నుంది. తర్వాత మార్చిన 20వ తేదీన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. …