మఠంపల్లి మండలంలో వ్యక్తి దారుణ హత్య..!

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని సుల్తాన్ పురం తండా శివారులో పానుగోతు పాచ్చు (35) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు… స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..భీమ్లా తాండకు చెందిన పానుగోతు పాచ్చు తండ్రీ పూల్ సింగ్ సుల్తాన్ పురం తండా శివారులోని తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి తిరిగి వస్తున్నా ఈ క్రమంలో సుల్తాన్ పురం సమీపంలోని చెర్ల తండాకు వెళ్లే రోడ్డులో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై రాళ్లతో విపరీతంగా దాడి చేసి హత్య చేశారు.. దాడి చేస్తున్న సమయంలో పాచ్చు తన సోదరుడైన పజ్జుకు ఫోన్ చేసి తన్ను కొట్టి చంపుతున్నారని చెప్పాడని. పలువురు చేర్చింకుంటునట్లు తెలుస్తుంది. పజ్జు అక్కడికి వెళ్లేసరికి పాచ్చు మొఖంపై రాళ్లతో దాడి చేసి హత్య చేశారు.. .పాచ్చుకు తన భూమి పక్కనే ఉన్న కొందరితో గత కొంతకాలంగా భూ తగాదాలు జరుగుతున్నాయని,దీని వెనుక వారి ప్రమేయం ఏదైనా ఉండవచ్చునని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు పాచ్చు లారీ డ్రైవర్ గా పనిచేస్తూ..వ్యవసాయం చేస్తుంటాడు. మృతుడికి భార్య సుమతి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న హుజూర్ నగర్ సిఐ చరమందరాజు సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.. ఈ హత్యతో ఒకసారి గా తండా ఉనికి పడింది..