*సమస్యల పట్ల రోడ్డెక్కిన విద్యార్థులు..*
*సమస్యలు చెప్పుకుంటున్న విద్యార్థుల్ని టార్గెట్ చేస్తున్న అధ్యాపకులు వార్డెన్.*
*రెండు రోజులుగా నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు..*
*నియోజకవర్గ వ్యాప్తంగా ఇసుక, మట్టిపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదంటూ విమర్శలు..*
*సూర్యపేట జిల్లా*…. మేళ్లచెరువు మండల కేంద్రంలో శ్రీనగర్ కాలనీ దగ్గర ఉన్నటువంటి TGTWTURJC..
గురుకుల పాఠశాల మరియు కాలేజీ నందు గత రెండు రోజులుగా వాటర్ రావడం లేదని కోదాడ మేళ్లచెరువు మెయిన్ రోడ్డు నందు విద్యార్థులు ధర్నాకు దిగడం జరిగింది. …
దీనితో ట్రాఫిక్ కు అంతరాయం కలగటం జరిగింది. వెంటనే
పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులకు సర్ది చెప్పి ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది…
*ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ* ..
TGTWTURJC గురుకులం, మరియు కాలేజీ నందు వారం రోజులుగా నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే కనీసం పట్టించుకునే నాధుడే లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారిని టార్గెట్ చేసి విద్యార్థులను కొడుతున్నారని… చెప్పాలంటేనే భయంగా ఉందని అన్నారు…. సరిగ్గా వసతులు లేవు అని ప్రశ్నించిన ప్రతిసారి నోరు మూసుకొని కూర్చో అంటూ విద్యార్థుల పట్ల ఎక్కువగా స్పందిస్తున్నారని దీంతో ఎవరు కూడా సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదు అని అన్నారు.. ఇక నీళ్లు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురుకావడంతో ఒక్కసారిగా విద్యార్థులంతా ఐక్యమై ధర్నా చేయడం జరిగిందని చెప్పారు……
సరైన పద్ధతిలో భోజనం పెట్టకపోయినా పర్వాలేదులే కానీ కనీసం విద్యార్థులకు నీళ్లు కూడా ఇవ్వలేరా అంటూ ప్రశ్నిస్తున్నారు..
ఇలాంటి సమస్యలతో మా పిల్లలు ఎలా చదువుతారు అంటూ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..