వధువు పక్కన నిల్చొని నీళ్లు తాగుతున్నందుకు ఫొటోగ్రాఫర్‌ను కొట్టాడు వరుడు..ఈ పెళ్లి వద్దని చెప్పేసిన వధువు..!.
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరగాల్సిన ఓ మ్యారేజ్ డ్రామాటిక్‌గా బ్రేక్ అయిపోయింది. వధువు పక్కన నిల్చొని నీళ్లు తాగుతున్నందుకు ఫొటోగ్రాఫర్‌ను కొట్టాడు వరుడు..ఇంత చిన్న విషయానికి ఎందుకలా బిహేవ్ చేస్తున్నావని వధువు అడిగితే.. అంతకు మించిన కోపంతో దాడి చేశాడు. దీంతో పెళ్లి కూతురు వెంటనే తనకు ఈ పెళ్లి వద్దని చెప్పేసింది. తర్వాత జరగనున్న పెళ్లి తంతుకు గుడ్ బై చెప్పేసి పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి కొడుకు, అతని తల్లి వరకట్నం డిమాండ్ చేస్తున్నారని కేసు పెట్టింది. ఇండోర్‌లోని కోష్టి సమాజ్ ధర్మశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాబు ఘన్‌శ్యామ్ నగర్‌కు చెందిన పెళ్లి కూతురు తరుణ.. గౌరవ్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. నిజానికి వీరిద్దరు రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ జరిగిన ఈ సంఘటనతో వధువు కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 14న ఎంగేజ్మెంట్లో గోల్డ్ రింగ్, రూ. 51వేల కట్నం ఇచ్చామని.. తర్వాత మరింత బంగారం, డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించింది..