జార్ఖండ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు..కాంగ్రెస్ శ్రేణులు సమరోత్సాహంతో ఉన్నాయని.. రామ్గఢ్, బొకోరో స్థానాల్లో పక్కాగా గెలిచి తీరతామని అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని, సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తాను ఝార్ఖండ్లోనే ఉంటానని, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెద్దలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని తెలిపారు. కాగా, ఝార్ఖండ్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై శుక్రవారం సాయంత్రం రాంచీలో నేతలు కసరత్తు చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.