ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి..!

*🔹”పొంగులేటి శ్రీనివాస రెడ్డి” కామెంట్స్..*

– *🔹ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్.*

– _• రేపటి కేబినెట్ సమావేశంలో చర్చించక ఎన్నికల తేదీ పై స్పష్టత ఇస్తాం._

– *• తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.*

– _*అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు.*_

– ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలి

– నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి

– *ఎన్నికలకు రావడానికి 15రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి…. మీ మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం అవ్వండి.*

– *రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది.*

– ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చడం జరిగింది.

– రాబోవు వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకోని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమా చేయడం జరుగుతుంది.

– సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే

– మీ మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు… వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే చూసుకోవాలి