సిస్టర్ స్ట్రోక్‌తో.. కేటీఆర్ చిన్న మెదడు చితికింది…మంత్రి సీతక్క

సిస్టర్ స్ట్రోక్‌తో.. కేటీఆర్ చిన్న మెదడు చితికిందని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. అవాస్తవాల ప్రచారంలో కేటీఆర్​ గోబెల్స్‌ను మించిపోయారని విమర్శించారు. గ్లోబల్స్ అబద్దాలకు గ్లోబల్ అవార్డు కేటీఆర్‌కు ఇవ్వాలన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. అబద్దాల బీఆర్ఎస్ నడుస్తుందన్నారు. కేటీఆర్​ప్రతిపక్ష పాత్రను మర్చిపోయారని చెప్పారు. రాహుల్ గాంధీ గురించి కేటీఆర్​మాట్లాడే స్థాయి లేదు అని మంత్రి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం.. కమీషన్ ముందుకు రావడానికి ఎందుకో చెప్పాలని మంత్రి డిమాండ్​చేశారు. కాళేశ్వరం విషయంలో కమీషన్లు కపిపుచ్చుకోవడానికి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిరూపించా లేదో కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రతిపక్ష హోదాకు కేటీఆర్ పనికిరారు అని, ఆయన ప్రజల కోసం ఎప్పుడూ పని చేయరు.. కానీ అబద్దాలను ప్రచారం చేయడంలో ముందుంటారని సీతక్క విమర్శించారు.కేసీఆర్​ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత చెప్పింది.. ఆమె చెప్పిన దయ్యం నువ్వేనా? కేటీఆర్ అని నిలదీశారు. రాహుల్ గాంధీని మాట్లాడి అర్హత కేటీఆర్‌కు లేదని, త్యాగాలపై రాజభోగాలనుభవించిన చరిత్ర కేసీఆర్​కుటుంబానిది అని వ్యాఖ్యానించారు. కేసీఆర్​కుటుంబానికి దోచుకునీ, దాచుకునే చరిత్ర అన్నారు. భారత నీతిని ప్రదర్శించలేని మోడీని ట్రంపు నీతితో ముందుకు వెళ్తున్నాడరని విమర్శించారు. భారతదేశ ఔన్నత్యం కోసం దేశ ప్రజల కోసం మాట్లాడుతున్న రాహుల్ గాంధీపై కక్షగట్టి ఈడిని ప్రయోగిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రశంసల కోసం కేటీఆర్ పాకులాడుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. పీసీసీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ పత్రిక, స్వతంత్ర ఉద్యమ గొంతుక కోసం తన వంతు సహాయం చేశాడన్నారు. అధికార పదవిలో లేనప్పుడు ఇంకా ఎక్కడ అధికార దుర్వినియోగం జరిగిందో ఈడి చెప్పాలన్నారు.