లిఫ్ట్ పనులు త్వరగా పూర్తి కావాలి… మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…

*సూర్యపేట జిల్లా* .

పాలకీడు మండలం బెట్టే తండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు .ముసీ నదిపై 33.83 కోట్లతో నిర్మాణ పనులను రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఆదివారం పాలకవీడు మండలంలోని బెట్టేతండా లిఫ్ట్ అలాగే కృష్ణా నదిపై జాన్ పహాడ్ శివారులో జాన్ పహాడ్ జవహర్ లిఫ్టు జరుగుతున్న లిఫ్ట్ పనులను ఆయన ఎమ్మెల్సీ రమావత్ శంకర్ నాయక్ తో కలిసి పరిశీలించారు…

*-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ*
33.83 కోట్లతో ఏర్పాటు చేస్తున్న లిఫ్ట్ వలన బెట్టేతండా పాడ్య తండా సజ్జపురం గ్రామాల్లోని 2041 ఎకరాల భూమికి సాగునీరు అందుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.దీనివలన 2176 రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి లక్ష 66వెయిల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. ఈ లిఫ్టు పనులు పూర్తి అయితే 1877 గిరిజన రైతులకు 34 మంది ఎస్సీ, 168 మంది బీసీ , 97 మంది ఓసి రైతుల భూములకు సాగునీరు చేరుతుందన్నారు. ఇప్పటికే భూ సేకరణ పూర్తి అయిందని భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం కూడా అందించడం జరిగిందని తెలిపారు. ఈ లిఫ్టు పనులను ఆగస్టు వరకు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ హనుమంత రావుకు ఆదేశించారు. పనులలో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. బెట్టేతండా చెక్ డాం కూడా అవసరం ఉందని గుర్తించామని వాటికి సంబంధించిన పనులకు ప్రతిపాదనలు తయారుచేసి త్వరగా పంపించాలని ఇరిగేషన్ అధికారణ ఆదేశించారు..ఇది పూర్తి అయితే
బెట్టే తండా,పాడే తండా,సజ్జాపురం తదితర గ్రామాలకు చెందిన 2,041ఎకరాలు సస్యశ్యామలంగా మారుతాయని ఆయన చెప్పారుm.ఆదివారం సాయంత్రం ఆయన పాలకీడు మండలంలోని బెట్టే తండా వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పధకంతో పాటు అదే మండలంలోని జాన్ పహాడ్ ఎత్తిపోతల పథక నిర్మాణాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నీటి లభ్యత ఉన్న ప్రతీ చోట ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి కొత్త ఆయకట్టును సాగిలోకి తేవాలి అన్నది ప్రభుత్వ సంకల్పంగా పెట్టుకుని ముందుకు పోతున్నామన్నారు.

అందులో భాగంగానే మూసి నీటితో బెట్టే తండా వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామన్నారు.

2,176 మంది రైతాంగానికి లబ్ది చేకూర్చనున్న ఈ ఎత్తిపోతల పథకం మీద ప్రభుత్వం 33.83 కోట్లు ఖర్చు పెడుతుందన్నారు.అంటే ఒక్కో ఎకరాకు లక్షా 66 వేలు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టును సేద్యం లోకి తెస్తున్నట్లు ఆయన వివరించారు.

పైగా ఈ ఎత్తిపోతల పధకం పూర్తి అయితే లబ్దిపొందేది పెద్ద సంఖ్యలో గిరిజన రైతులని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ ఎత్తిపోతల పథకాన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసేందుకు గాను ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసి భూ నిర్వాసితులకు నగదు చెల్లించినట్లు ఆయన తెలిపారు.
పనులు వేగవంతంగా పూర్తి చేసి ఆగస్టు మాసంతానికి నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.