వారికి తన కంటే అందగాడు భారత్ లో కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలను ట్రోల్స్ చేస్తున్నారు’..ఓవైసీ…

ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరులో భాగంగా తన వంతు పాత్రను సమర్దవంతంగా పోషిస్తున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. పాకిస్తాన్ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు… హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తనను పాకిస్థానీలు ట్రోల్స్ చేయడంపై స్పందిస్తూ.. ఆసక్తికర కౌంటర్ ఇచ్చారు.

అవును… గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ పై విపరీతంగా విరుచుకుపడుతూ, ఆ దేశం మానవాళి మనుగడకు ముప్పుగా మారిందని అంటున్నారు. పాక్ కు బుద్ది చెప్పాల్సిందే అని ఫైరవుతున్నారు. దీంతో.. సోషల్ మీడియాలో పాకిస్థానీలు ఒవైసీని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై తాజాగా స్పందించిన ఎంఐఎం అధినేత.. నవ్వుతూ కౌంటర్ ఇచ్చారు.

ఇందులో భాగంగా… పాకిస్థాన్ కు ఒక్క దుల్హే భాయి (బావమరిది) ఉంటే అది తానే అని.. తనను మించిన ధైర్యంగా, అందంగా మాట్లాడగలిగేవారెవరూ వారికి కనిపించడం లేదని.. వారికి భారత్ లో కనిపించేది తాను మాత్రమే అని అన్నారు. ఈ సందర్భంగా.. తనను చూడాలని, తన ప్రసంగాలు వినాలని.. ఫలితంగా మీ జ్ఞానం పెరుగుతుందని, మీ మెదడులో ఉన్న చెడు, అజ్ఞానం పోతుందని పాక్ కు సూచించారు ఒవైసీ!

కాగా… పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి తొలుత ఒవైసీని కేంద్రం ఆహ్వానించలేదు. ఒవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. అమిత్ షా స్వయంగా ఒవైసీని ఆహ్వానించారు. అప్పటి నుంచి.. అన్ని అఖిలపక్ష సమావేశాలకూ ఒవైసీ హాజరవుతూ వచ్చారు. ఈ సమయంలో విదేశాల్లో భారత వాణిని వినిపించడానికి ఆయనను కేంద్రం ఎంపికచేసింది.

ఇక.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం హైదరాబాద్ ఎంపీ ఒవైసీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. శుక్రవారం ప్రార్థనల ముందు మసీదులో నలుపు రంగు పట్టీలను ధరించాలని సూచించారు. ఇదే సమయంలో పాక్ నేతలు చేస్తోన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ధీటుగా స్పందించారు. దేశ భద్రత విషయంలో భారత్ కు తాను అండగా నిలుస్తానని ప్రకటించారు.

ఈ సందర్భంగా… పాకిస్థాన్ ముర్దాబాద్ – హిందూస్థాన్ జిందాబాద్ అంటూ గట్టిగా నినదించిన ఆయన వీడియోలు మతాలకు అతీతంగా ఆయనకు మరింత ప్రజాదరణ తెచ్చిపెట్టాయనే చెప్పాలి! దీంతో.. పాక్ లో ఆయనపై ట్రోల్స్ మొదలయ్యాయి. దీనిపై స్పందించిన ఒవైసీ… తాను పాక్ కు బావమరిదిని అని సరదాగా స్పందించారు!..

ఇస్లాంలో హింసకు తావులేదని పదే పదే చెబుతున్న అసదుద్దీన్ పై పాకిస్తాన్ కు చెందిన పలువురు ట్రోలింగ్‌కు దిగారు. దీనికి ఓవైసీ నవ్వుతూనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘ పాకిస్తాన్ లో ఉన్న వారికి భారత్ లో ఉన్న నేను మాత్రమే కనిపిస్తున్నాను. నా కంటే అందగాడు వారికి కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలు వింటూ ఉన్నారు. నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తీసేయండి. అది అందరికీ మంచిది. మీ అజ్ఞానం కూడా అంతమవుతుంది’ అని అసదుద్దీన్‌ తెలిపారు.

‘ ‘మీపై పాకిస్తాన్ ట్రోలింగ్ ఎక్కువైంది కదా” ? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఓవైసీ నవ్వుతూ స్పందించారు. వారికి తన కంటే అందగాడు భారత్ లో కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలను ట్రోల్స్ చేస్తున్నారు’ అంటూ చమత్కరించారు.

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటానికి ఓవైసీ సిద్ధమవుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, ఆపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఓవైసీకి ఆహ్వానం చివరి నిమిషంలో అందింది. తొలుత ఓవైసీకి ఆహ్వానం అందలేదనే వార్తల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఓవైసీని అఖిలపక్ష సమావేశానికి రమ్మని ఆహ్వానించారు.

అప్పట్నుంచీ పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగడుతూనే ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్ ఓ ఉగ్రవాద దేశంగా మారిపోయిందని, ఆ దేశం అర్థ శతాబ్దం వెనక్కి పోయిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ తీరుపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు ఓవైసీ..