మిరాయ్’ మూవీ రివ్యూ…!

నటీనటులు: తేజా సజ్జా, శ్రీయా సరన్, మంచు మనోజ్, రితికా నాయక్, జగపతిబాబు, జయరాం, రాజేంద్రనాథ్, పవన్ చోప్రా, తంజా కెల్లర్ తదితరులు.

దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్

మ్యూజిక్: గౌరా హరి

సినిమాటోగ్రఫి: కార్తీక్ ఘట్టమనేని

ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్

డైలాగ్స్: మణిబాబు కరణం ప్రొడక్షన్

డిజైనర్‌: శ్రీ నాగేంద్ర తంగల

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

mirai-movie-review-

తేజ స‌జ్జా, రితిక నాయక్ జంటగా తెరకెక్కిన సినిమా ‘మిరాయ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా భారీగా తెరకెక్కించారు. మంచు మ‌నోజ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండగా శ్రియ‌, జ‌గ‌ప‌తి బాబు, జ‌య‌రాం.. లాంటి చాలా మంది స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిరాయ్ సినిమా నేడు సెప్టెంబర్ 12న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది.(Mirai Review)..

కథ విషయానికొస్తే.. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఆ రక్తపాతం చూసి మారిన చరిత్ర మనం చదువుకున్నాం. అక్కడనుంచే కథ మొదలవుతుంది. ఆ యుద్ధం తర్వాత తన దగ్గరున్న శక్తులు వద్దనుకుని వాటిని 9 గ్రంధాల్లో భద్రపరిచి ప్రపంచం నలుమూలలా ఉన్న 9 మంది యోధులకు అప్పగిస్తాడు. ఆ గ్రంధాలను జాగ్రత్తగా భద్రపరచాలి అని చెప్తాడు. కాలక్రమేణా ఆ యోధుల వారసులు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆ 9 గ్రంధాలను కాపాడుతూ ఉంటారు.

2000 సంవత్సరంలో 9వ గ్రంధాన్ని కాపాడే అంబికా(శ్రియా)కు భవిష్యత్తు కనపడటంతో మిగిలిన గ్రంధాలు కాపాడే వాళ్ళని పిలిచి జాగ్రత్త చెప్తుంది. ఈ గ్రంధాలను, ప్రపంచాన్ని కాపాడటానికి అంబికా అగస్త్యముని(జయరాం) ఆదేశాలతో తన కడుపులో ఉన్న కొడుకుని పుట్టగానే వదిలేసి కనపడకుండా పోతుంది. 24 ఏళ్ళ తర్వాత అప్పటికే మహావీర్ లామా(మంచు మనోజ్) 6 గ్రంధాలను స్వాధీనం చేసుకుంటాడు. దీంతో అంబికా ఆశ్రమానికి చెందిన విభా(రితిక నాయక్) అంబికా కొడుకు వేద(తేజ సజ్జ)ని వెతుక్కుంటూ వెళ్తుంది…

నటీనటులు:

తేజ సజ్జ సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచాడు యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు అదరగొట్టాడు. మంచు మనోజ్ ‘బ్లాక్ స్వోర్డ్’ విలన్‌గా తన ఫైట్ సన్నివేశాల్లో డామినేట్ చేశాడు. ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు కూడా బాగుంది. రితికా నాయక్ సపోర్టింగ్ హీరోయిన్‌గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. జగపతి బాబు, జయరామ్ లాంటి సపోర్టింగ్ కాస్ట్ తమ పాత్రల్లో సమర్థవంతంగా నటించారు. శ్రీయకు లైఫ్ టైం క్యారెక్టర్ పడింది.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు మరో హీరో ఉన్నాడు.. అతడే మ్యూజిక్ డైరెక్టర్ గౌరీ హరి. సినిమాకు ఆయువు రీ రికార్డింగ్. చాలా సన్నివేశాలు కేవలం RR తో హైలైట్ అయ్యాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రాణం. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగానే కాదు సినిమాటోగ్రాఫర్ గానూ సత్తా చూపించాడు.

కళింగ యుద్ధం చూసి..

భారతదేశం చూసిన అతిపెద్ద యుద్ధాల్లో కళింగ యుద్ధం ఒకటి. సుమారు 261 బీసీలో జరిగిన ఈ యుద్ధంలో కళింగ రాజ్యంపై మౌర్యులు దండయాత్ర చేశారు. మౌర్య సైన్యాన్ని ఈ యుద్ధంలో గెలిపించి కళింగ రాజ్యాన్ని అశోకుడు ఆక్రమించాడు. అయితే యుద్ధాన్ని గెలిచినా కూడా ఎక్కడో అశోకుడిలో ఒక బాధ, ఆక్రోశం, అశాంతి మిగిలిపోయాయి. కొన్ని లక్షలమంది ప్రాణాలు తీసి నేనేం సాధించాను అనే ప్రశ్న అశోకుడ్ని తొలిచేసింది. అసలు ఇంతటి రక్తపాతాన్ని తాను సృష్టించగలగడానికి కారణం తనకి ఉన్న అతీతశక్తులే అని అశోకుడు చింతిస్తాడు. దీంతో ఆ శక్తులన్నింటినీ 9 గ్రంథాలలో నిక్షిప్తం చేసి వాటికి 9 మంది రక్షకుల్ని నియమిస్తాడు.

ప్రపంచవ్యాప్తంగా వీటిని మానవాళి రక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలని సూచిస్తాడు. ఇలా అశోకుడు నియమించిన ఆ రక్షకులు ఈ గ్రంథాలను తరతరాలుగా కాపాడుతూ తరువాతి తరంలో రక్షకుడ్ని కూడా నియమిస్తూ ఉంటారు. అలా 2000 సంవత్సరంలో 9వ గ్రంథమైన అమృత గ్రంథానికి రక్షకురాలే అంబికా (శ్రియ). ఆమెకి భవిష్యత్తు చూడగలిగే శక్తి ఉంటుంది. దీంతో ఒకసారి అంబికాకి భవిష్యత్తులో 8 గ్రంథాల్ని ఒక దుర్మార్గుడు మహావీర్ (మంచు మనోజ్) సొంతం చేసుకున్నట్లు కనిపిస్తుంది. వెంటనే మిగిలిన 8 మంది గ్రంథ రక్షకులతో సమావేశం అయి విషయం చెబుతుంది.

అయితే వాళ్లెవరూ ఈ హెచ్చరికని లెక్క చేయరు. ఏమైనా సరే గ్రంథాల్ని తాము రక్షించుకుంటామని వెళ్లిపోతారు. కానీ భవిష్యత్తును ముందే తెలుసుకోగలిగే అంబికా ఎలాగైనా ఈ ప్రమాదానికి పరిష్కారాన్ని వెతకాలని హిమాలయాల్లోని కైలాస శిఖరాన్ని చేరుతుంది. అక్కడ ఆమెకి అగస్త్య మహాముని (జయరామ్) దర్శనమిస్తాడు. నువ్వు చూసిన ప్రమాదం నిజమే.. కానీ దాన్ని ఆపాలంటే దానికి ఒక త్యాగం కావాలి.. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని త్యాగం చేయగలవా అంటూ అగస్త్యుడు అడుగుతాడు. దీంతో మానవాళి శ్రేయస్సు కోసం అంబికా దానికి అంగీకరిస్తుంది. దీంతో సరిగ్గా నీ బిడ్డ పుట్టిన 24 ఏళ్లకి అతనికి తన ధ్యేయం ఏంటో తెలుస్తుంది. ఆ దుష్టశక్తిని ఆపగలిగే ఆయుధం కోసం తన ప్రయాణం మొదలవుతుంది అంటూ అగస్త్యుడు చెబుతాడు…

విజువల్స్ మాత్రం అదుర్స్
జెన్‌జీ పిల్లలకి రామాయణ, మహాభారతాల గురించి పురాణాల గురించి చెప్పడానికి వీఎఫ్ఎక్స్‌ని మించిన మాద్యమం లేదేమో అనిపించే విధంగా ఈ మధ్య కాలంలో సినిమాలు వస్తున్నాయి. గతేడాది హను మాన్, కల్కి 2898 ఏడీ రీసెంట్‌గా వచ్చిన కొత్త లోక ఇలా అన్నీ వీఎఫ్‌ఎక్స్ విషయంలో అద్భుతమే చేశాయి. ఇప్పుడు మిరాయ్ కూడా అదే రిపీట్ చేసింది. సినిమాలో కథ, కథనం, లాజిక్స్ ఇవన్నీ పక్కన పెడితే థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడికి ఒక సరికొత్త అనుభూతిని.. విజువల్ వండర్‌ని అయితే ఖచ్చితంగా మిరాయ్ చూపించింది..అవెంజర్స్, అమెరికన్ సూపర్ హీరోస్ వంటి సినిమాలు చూసి ఛ ఇలాంటి సినిమాలు మనవాళ్లు ఎప్పుడు తీస్తార్రా అని ఆవేదన చెందిన ఎంతోమంది ప్రేక్షకులకి మిరాయ్ ఖచ్చితంగా ఒక ఊరటనిస్తుంది. అందులోనూ ఈ వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేసింది మన హైదరాబాద్ టీమ్ అవ్వడం నిజంగా గర్వకారణం. ఎక్కడో హాలీవుడ్‌కి వెళ్లి విదేశాలకి వెళ్లి తాము గ్రాఫిక్స్ చేయలేదు.. మన హైదరాబాద్‌లో మా స్టూడియోలోనే చేసిన గ్రాఫిక్స్ ఇవన్నీ అంటూ తేజ సజ్జా చాలా గర్వంగా గొప్పగా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కూడా అది నిజమే అనిపించకమానదు.