నీ కమీషన్ దాహం వల్లే కదా నేడు తుంగతుర్తి లో పనులు ఆగిపోయింది…..

ఎమ్మెల్యే మందుల సామెల్  అవగాహన లేకుండా మాట్లాడుతుండు.. అంటు brs శ్రేణులు ఆరోపించారు..
పలువురు నాయకులు మాట్లాడుతూ…
హరీష్ రావు పుణ్యమాని గిడ్డంగుల సంస్థ చైర్మన్ అయ్యావు..
గిడ్డంగుల సంస్థ చైర్మన్ కాకముందు నీ పరిస్థితి ఏంది..
పార్టీ మారగానే అన్నీ మారతాయా..
సక్రమైన మార్గన ఆస్తులు కూడబెట్టుకో..
దోసెడు ఇసుక కూడా పోనివ్వను అన్నావు..
కానీ నేడు రోజు వందల లారీల్లో ఇసుక పోతుంది.
నీ కమీషన్ దాహం వల్లే కదా నేడు తుంగతుర్తి లో పనులు ఆగిపోయింది..
కాలేశ్వరం కూలిపోయింది అన్నావు.. కానీ బిక్కేరు లో ఎక్కడి నుండి వచ్చిన నీళ్లకు పూలు జల్లుతున్నావు..
ముందు నీ పార్టీలోని లొల్లిని ఆపు.. తర్వాత బిఆర్ ఎస్ పార్టీని విమర్శింద్దువు గాని.
రైతులు నీళ్లు అడిగితె ఒక్క చుక్క కూడా నీళ్లు రావు అంటావా…
ఇకనైనా తుంగతుర్తి అభివృద్ధి కోసం పాటుపడు..
పార్టీ వేరైనా మేము కూడా హర్షిస్తాము…
మా పార్టీ జోలికొస్తే ఇక ఊరుకునే ప్రసక్తి లేదు….

మోత్కూర్ మున్సిపాలిటీ లో గత ఎమ్మెల్యే హయామ్ లో శాంక్షన్ అయినా పనులే నేటికీ కొనసాగుతున్నాయి…. అస్తవ్యస్థంగా రోడ్డు పనులు చేస్తున్నారు..
మున్సిపల్ బిల్డింగ్ ని పూర్తి చేసే దమ్ము లేదు…
ఇకనైనా పొల్లు పొల్లు నుజ్జు నుజ్జు మాటలు మానేయండి…
కమీషన్ల కోసం పనులు జరగనీయడం లేదు..
వెనకబడ్డ తుంగతుర్తి నియోజకవర్గన్ని గాదరి కిషోర్ నాయకత్వం లో చాలా అభివృద్ధి చేసుకున్నాము
సింగిల్ విండో బ్యాంకు లో అవినీతి జరిగింది అని అవిశ్వాసం పెట్టి దించారు. మరి ఇంతవరకు ఎందుకు ఆ అవినీతిని నిరూపించలేకపోతున్నారు…
సింగిల్ విండో లో ఉన్న నిధులన్నీ కాంగ్రెస్ కార్యకర్తలకు లోన్ ల రూపం లో ఇస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా రికవరీ చేయడం లేదు.
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రనికి బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష….ఆ విషయం తెలంగాణ ప్రజలకు కూడా అర్ధం అయింది.

ఉచితాలు బందు పెట్టె దమ్ము రేవంత్ రెడ్డి కీ ఉందా… దమ్ముంటే బందు చేసే చూడు…