బిఆర్ నాయుడు వీడియోలు తప్పు లేనిది, మా మాధురి తిరుమల గెస్ట్ హౌస్ లో పుట్టిన రోజు కేక్ కట్ చేస్తే తప్పేమిటి..ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్..

బిఆర్ నాయుడు వీడియోలు తప్పు లేనిది, మా మాధురి తిరుమల గెస్ట్ హౌస్ లో పుట్టిన రోజు కేక్ కట్ చేస్తే తప్పేమిటి అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిలదీశారు. బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టిన రోజు తిరుమల స్వామివారి సన్నిధిలో జరుపుకోవాలనుకోవడం తప్పేమిటని అన్నారు. తన బర్త్ డే కూడా అదే రోజు.. అందువల్ల నేనే ఆమెను మాధురితో కలిసి ప్రోటోకాల్ దర్శనానికి తీసుకెళ్లాను. తిరుమలలో కేక్ కట్ చేయకూడదని మాకు తెలియదు. అయినా అది ఎగ్ లెస్ కేక్ అని బిల్లు కూడా చూపించారు. బిఆర్ నాయుడు టిటిడి చైర్మన్ అయితే, నేను ఎమ్మెల్సీని అని అన్నారు. అనవసర వివాదాలలో తిరుమల ప్రతిష్ట దెబ్బతీయొద్దు అని సూచించారు. ఈ మేరకు ఆయన మాధురితో కలిసి సెల్ఫీ వీడియో విడుదల చేశారు…

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిల కేక్ కటింగ్ వివాదం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. తిరుమలలో బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు వేడుకలు జరపడంపై భక్తులు, హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తిరుమలలోని గెస్ట్ హౌస్‌లో కేక్ కట్ చేయడం నియమాలకు విరుద్ధమని టీటీడీ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఆరోపణలను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి తిరస్కరించారు. తాము కట్ చేసింది ఎగ్ లెస్ (గుడ్డు లేని) కేక్ అని, అది కూడా నియమ నిబంధనలు తెలియక చేసిన పని అని వారు స్పష్టం చేశారు. తాము శ్రీవారికి పరమ భక్తులమని, తాము ఎలాంటి అపచారం చేయలేదని వారు వాదిస్తున్నారు..ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ఇతర అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. కేసులు, విచారణలకు తాము సిద్ధంగా ఉన్నామని, చట్టపరంగానే దీనిని ఎదుర్కొంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. గతంలో కూడా తిరుమలలో రీల్స్ మరియు ఫొటో షూట్ల విషయంలో వీరిద్దరూ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే..