కేసీఆర్‌ దేవుడు.. కానీ, కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి..mlc కవిత..!

*హైదరాబాద్‌:*

రెండు వారాల క్రితమే కేసీఆర్‌కు లేఖ రాశాను.. నా అభిప్రాయాలు లేఖ ద్వారా తెలిపాను.. కార్యకర్తల అభిప్రాయాలే చెప్పాను..

పూర్తి వీడియో చూడటానికి లింక్ క్లిక్ చెయ్యండి..

https://youtu.be/GhdZpjvENLg?si=iURjfFjin81bdKam
నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పలేదు, నా పర్సనల్‌ అజెండా లేదు.. ఆ లేఖ ఎలా బహిర్గతమైంది?.. లేఖ లీక్‌ చేసింది పార్టీలోని కొందరు కోవర్టులే..

కేసీఆర్‌ దేవుడు.. కానీ, కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి.. అతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏంటి?.. నా లేఖే బయటకు వచ్చిదంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి?

కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్‌ నాయకత్వంలోనే పని చేస్తాం.. పార్టీలోని లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్‌ ఉంటుందని నా అభిప్రాయం

బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణను ఫెయిల్‌ చేశాయి.. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆర్‌ నాయకత్వమే-కవిత…

తాను రాసిన లేఖను కుట్రపూరితంగా బయటపెట్టారని, కేసీఆర్ కుమార్తెగా తన పరిస్థితే ఇలా ఉంటే పార్టీలో ఇతరుల పరిస్థితి ఏమిటో చర్చ జరగాలని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుందని, కోవర్టులను తప్పించుకొని ముందుకెళ్లాలని సూచించారు. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు జాగృతి కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు.

గతంలో రాసినట్లే రెండు వారాల క్రితం లేఖ రాశానని అందులో ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అందరూ అనుకుంటున్న, చెప్తున్న విషయాలనే తాను లేఖలో రాసినట్లు వివరించారు. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం కుట్రపూరితమేనని, నాయకుడికి రాసిన లేఖ బహిర్గతమైందంటే దానికి వెనక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సి ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. తన పరిస్థితే ఇలా ఉంటే ఇతరుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్ను కవిత దేవుడిగా అభివర్ణించారు…

పార్టీలో ఏం జరుగుతుందో అందరూ ఆలోచించాల్సిన అసవరం ఉంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది. బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణను మోసం చేశాయి, నాశనం చేశాయి. బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోందని, కేసీఆర్ ఆగమవుతున్నారని కాంగ్రెస్ సంబరపడుతోంది.” అని కవిత అన్నారు.

ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని ఆమె పెను సంచలనం సృష్టించారు. కోవర్టులను పక్కకు పెట్టి ముందుకెళ్తే పార్టీ బాగుపడుతుందని ఆమె చెప్పారు. కేసీఆర్ తమ నాయకుడని, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుందని అన్నారు…

లేఖ బయటకు రాగానే కాంగ్రెస్, బీజేపీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయని కానీ అంత సీన్ లేదని చెప్పుకొచ్చారు. ఆరెండు పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శలు చేశారు…

ఎమ్మెల్సీ కవిత అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కవితకు ఘన స్వాగతం పలికారు జాగృతి నేతలు, అభిమానులు. జై కవితక్క అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న కవితక్కకు స్వాగతం అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాగా, కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాలేదు. ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు కూడా కనిపించలేదు…