కవిత దిష్టిబొమ్మ దగ్ధం…!

కవిత దిష్టిబొమ్మ దగ్ధం.
https://x.com/r9telugunews/status/1962833265808859175
భారత రాష్ట్ర సమితి పార్టీతో పూర్తిగా తెగదింపులు చేసుకోవాలని పార్టీ పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే యువచనలు ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మలను పార్టీ నాయకులు అనేక ప్రాంతాల్లో దగ్ధం చేస్తున్నారు. హరీష్ రావు సంతోష్ రావులపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కవిత దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. నిజామాబాద్ కరీంనగర్ ప్రాంతాల్లో కవిత దిష్టిబొమ్మలు దగ్ధం అవుతున్నాయి. సస్పెన్షన్ వేటుపై కవిత తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పార్టీ నుండి పూర్తిగా తెగ తెంపులు చేసుకోవడంతో పాటు తన దిష్టిబొమ్మలను తగలబెడుతున్నడంతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకుపోతున్నట్టు విశ్వసినీ సమాచారం..

కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు

హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన

హరీశ్ రావు పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు

కవిత బీజేపీ నాయకులకు అమ్ముడు పోయినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం

పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరిక….