మొబైల్ యూజర్లకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఇకపై మొబైల్ ఫోన్లకు రీఛార్జ్ చేయడం కష్టమే.. ఎందుకంటే.. అతి త్వరలో మొబైల్ టారిఫ్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే జోరుగా ప్రచారం జరుగుతోంది. భారత టెలికం మార్కెట్లో కాలింగ్, మొబైల్ డేటా అత్యంత ఖరీదైనవిగా మారనున్నాయి. నివేదికల ప్రకారం.. టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్లను 15 శాతం వరకు పెంచబోతున్నట్టు తెలుస్తోంది…వచ్చే జూన్ 2026 నాటికి టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ప్లాన్లను భారీగా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతోంది. అదే జరిగితే మొబైల్ రీఛార్జ్ ధరల భారం వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్తలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
15 శాతం పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు :
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు జూన్ 2026 నాటికి రీఛార్జ్ ప్లాన్లను మరో 15 శాతం పెంచాలని యోచిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. భారత మార్కెట్లో మొబైల్ డేటా కూడా బంగారం మాదిరిగానే ఖరీదైనదిగా మారుతోందని ఎక్స్ యూజర్లు మండిపడుతున్నారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959