viral videoMonkey drinks alcohol,,మద్యం షాప్‌లోకి కోతి.. సీసా తీసుకుని తాగేసింది!
జార్ఖండ్‌లోని రాంచీలో ఓ కోతి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ మద్యం దుకాణంలోకి liquor shop incidentRanchi ప్రవేశించిన కోతి.. అక్కడ ఉన్న మద్యం సీసాను తీసుకుని, దాని మూతను పళ్లతో తొలగించి తాగినట్లు వీడియోలో కనిపించింది. కొద్దిసేపటికే మద్యం ప్రభావంతో కోతి తూలుతూ కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం.
ఈ వింత ఘటనను చూసిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు.
అసలే కోతి.. ఆపై కల్లు తాగింది’ అనే సామెతను మనం తరచూ వింటూనే ఉంటాం. కోతులు చేసే వింత చేష్టలకు ఈ సామెతను గుర్తు చేసుకుంటారు. కానీ ఇక్కడో కోతి ఈ సామెతను నిజం చేస్తూ నేరుగా వైన్ షాప్‌లోకి దూరి చేసిన వింత ప్రవర్తన అందరినీ షాక్‌కు గురి చేసింది. వైన్స్ షాప్‌లోకి చొరబడిన కోతి ఫుల్‌గా మద్యం సేవించి మత్తులో అక్కడే కునుకు తీసింది. ఈ విచిత్ర ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓర్మాంఝీ బ్లాక్ చౌక్ వద్ద చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం ఓ వైన్స్ లోకి దూరిన ఆడ కోతం ఒక మద్యం monkey videoOrmanjhi సీసాను తీసుకుని దాన్ని సీల్ కొరికి తీసి అందులోని మద్యాన్ని తాగేసింది. మద్యం సేవించిన కొద్దిసేపటికే మత్తు ఎక్కడంతో వైన్స్ లోనే మద్యం కాటన్లపై గాఢ నిద్రలోకి జారుకుంది. ఈ వింత దృశ్యాన్ని చూసిన స్థానికులు, షాప్ సిబ్బంది తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. వైన్ షాప్‌లో కోతి మద్యం తాగి నిద్రపోతున్న వార్త ఆ ప్రాంతంలో వ్యాపించడంతో దానిని చూడటానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని నిద్రపోతున్న కోతికి ఎలాంటి హానీ కలగకుండా సురక్షితంగా బయటకు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.