చింపాంజీ మాస్క్.. కోతులు షాక్…
వానరాల బెడదను అరికట్టేందుకు పంచాయతీ కార్యదర్శి వినూత్న ఆలోచన
యాదాద్రి భువనగిరి జిల్లా:
రాజాపేట మండలం మల్లగూడెం గ్రామ పంచాయతీలో కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు గ్రామ పంచాయతీ సిబ్బందికి చింపాంజీ మాస్క్ వేయించి వాటిని భయపెట్టే ఉపాయం చేశాడు ఆ ఊరి గ్రామ పంచాయతీ కార్యదర్శి..
రోజు రోజుకు కోతుల సంఖ్య పెరుగుతూ, ఇండ్ల మీద వీర విహారం చేస్తూ ప్రజలను భయ పెడుతూ.. ఇండ్లలో ఉన్నటువంటి ఆహారాన్ని ఎత్తుక పోతున్నాయని, మనుషుల మీదికి తిరగబడుతూ కరుస్తున్నాయి. చిన్నపిల్లలు బయటకు వెళితే వారి మీద దాడికి పాల్పడుతున్నాయని పంట పొలాల మీద మూకుమ్మడిగా దాడి చేస్తూ వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయ, తోటలను నాశనం చేస్తూ రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి…రైతులు పొలాల వద్ద ఏ పంట వేసిన దక్కకుండా కోతులు నాశనం చేస్తున్నాయని అంటున్నారు. రైతులు కోతుల బెడద నుండి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ..
వానరాల బెడదను అరికట్టేందుకు పంచాయతీ కార్యదర్శి వినూత్న ఆలోచన..