నేటి పంచాంగం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 28 – 01 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,

తిథి : *చతుర్దశి* రా7.29 వరకు,
నక్షత్రం : *పూర్వాషాఢ* ఉ8.58 వరకు,
యోగం : *వజ్రం* రా12.34 వరకు,
కరణం : *భద్ర* ఉ7.34 వరకు,
తదుపరి *శకుని* రా7.29 వరకు,

వర్జ్యం : *సా5.01 – 6.38*
దుర్ముహూర్తము : *ఉ8.52 – 9.36,*
మరల *రా10.56 – 11.47,*
అమృతకాలం : *రా2.41 – 4.18,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : ధనుస్సు,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.49,

*_నేటి మాట_*

*మానవ జీవితం – కర్మలు*
_మానవుడు విడువవలిసినవి – చేయవలసిన కర్మలు కొన్ని వుంటాయి, అవి ఏవి ? ఏమిటి??_
‘అహంకార ఆడంబరాలకు భగవంతుడు లొంగడు…’
ఎపుడూ, ఏది చేసినా కర్మే ఔతుంది, ఎపుడూ మానసికంగా,(మనసు, మాట తనువు) వాచకంగా, శారీరికంగా, భగవంతుని చింతించ డానికే ప్రయత్నించాలి.

ప్రతీమానవునికీ కర్మలంటూ ఉంటాయి, అవి 4 విధములు

1, వ్రతములు, నోములు, శ్రాధ్ధములు, గ్రహశాంతికి నమిత్తం చేసే కర్మలు, సామాన్య మానవుడు సంసార జీవితమును గడపడం లో ఆచరించేవి ఇవి,
ఇవన్నీ ‘నైమిత్తిక’ కర్మలు

2, మంచి వర్షాలు కురవాలి, పంటలు పండాలి, లోకమంతా శాంతిని అనుభవించాలి.. అందుకోసం చేసే కర్మలు
యజ్ఞ, యీగాదులు, మనం చేసే పూజలు, అన్నీ ‘కామ్యకర్మలు ‘ అంటారు.

3, మనం విడువవలసిన కర్మలు కొన్ని ఉంటాయి, మాంసాహారము, మత్తు పదార్థాలు, పూర్తిగా నిషేధించాలి.
సాత్వికాహారం తీసుకోవాలి, సాత్వికమైనదే కదా అని అతిగా భుజింపకూడదు ఎట్టి ఆహారమో అట్టి తలంపులు.
ఎట్టితలంపులో అట్టి మనసు, అన్ని సమయాల్లోనూ భుజింపకూడదు, ఇవన్నీ నిషిద్ధమైన కర్మలు.
… ఇక

4, దోషపరిహారంకోసం చేసే కర్మలు.
అవి – క్షేత్ర సందర్శనం, పవిత్ర నదీ స్నానం, మొదలైనవి.
గంగ నీరు గంగకే అర్పించునట్లు, మీ హృదయాన్ని భగవంతునికే అ ర్పించండి.
అపుడన్నీ భగవంతుడే చేయిస్తాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు.
ఆచరణలో ఫలాసక్తి చూపించకోవాలి,
మంచి చేసినా, చెడ్డ చేసినా తనకుతాను చేసుకోవడమే కదా! …

*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏