🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 13 – 02 – 2025,
వారం … భృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
బహుళ పక్షం,
తిథి : *పాడ్యమి* రా7.47 వరకు,
నక్షత్రం : *మఖ* రా8.52 వరకు,
యోగం : *శోభన* ఉ7.37 వరకు,
కరణం : *బాలువ* ఉ7.27 వరకు,
తదుపరి *కౌలువ* రా7.47 వరకు,
వర్జ్యం : *ఉ8.15 – 9.56*
మరల *తె5.26నుండి*
దుర్ముహూర్తము : *ఉ10.20 – 11.06,*
మరల *మ2.53 – 3.39,*
అమృతకాలం : *సా6.20 – 8.01,*
రాహుకాలం : *మ1.30 – 3.00,*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : సింహం,
సూర్యోదయం : 6.33,
సూర్యాస్తమయం: 5.56,
*_నేటి మాట_*
*అసలు దేవుడు వున్నాడా ??? – ఉంటే ఎందుకు కనిపించడు, వున్నాడని ఎలా నమ్మాలి!!..*
ఈరోజుల్లో అందరూ అనుకునే మాట!!…
ఇది వాస్తవం కూడా కదా!!
మరి మనం గాలి కనిపించనంత మాత్రానా ఊపిరి పీల్చడం మానేయడం లేదు కదా!
అలానే దేవుడు కనిపించనంత మాత్రానా నమ్మడం మానేయకూడదు,
బ్రతకాలంటే గాలి పీల్చాలి తప్పదు, ఆనందమును అనుభవించాలంటే దేవుని నమ్మి తీరాలి.
నిజానికి దేవుడు కనపడాలి అని కోరుకునే కంటే దైవత్వాన్ని అనుభవించాలి, అని కోరుకోవడం ఉత్తమం.
కలియుగంలో ఇది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి!…
అయినా దైవత్వాన్ని అనుభవించకుండా దేవుని చూసి ఏమి చేస్తారు??!
నిజ తత్వాన్ని అనుభవించనివారు నిజ రూపాన్ని దర్శించి ఏమి చేస్తారు?
కనుక నిజ భక్తులు ఎల్లపుడూ దైవత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
ఆ పరమేశ్వరుని యందు అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఉన్నపుడు, మన భక్తిలో విశ్వాసములో నిజం ఉన్నదని ఆయన అనుకున్నపుడు ఆయనే ఏదో రీతిగా దర్శనం ఇస్తాడు… ఇది వాస్తవం.
*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏