🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🦜పంచాంగం🦜
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 07 – 05 – 2025,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *దశమి* మ12.38 వరకు,
నక్షత్రం : *పుబ్బ* రా8.21 వరకు,
యోగం : *వ్యాఘాతం* రా2.58 వరకు,
కరణం : *గరజి* మ12.38 వరకు,
తదుపరి *వణిజ* రా1.10 వరకు,
వర్జ్యం : *తె4.06 నుండి,*
దుర్ముహూర్తము : *ఉ11.30 – 12.21,*
అమృతకాలం : *మ1.35 – 3.16,*
రాహుకాలం : *మ12.00 – 1.30,*
యమగండం : *ఉ7.30 – 9.00,*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : సింహం,
సూర్యోదయం : 5.35,
సూర్యాస్తమయం: 6.17,
*_నేటి విశేషం_*
*వాసవీ మాత – జయంతి*
*వాసవి దేవి జననం🙏*
వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్టి వైశ్యులకు రాజు.
ఈ ప్రాంతం విష్ణు వర్ధనుడు (విమలాదిత్య మహారాజు) ఆధీనంలో ఉండేది.
సా.శ. 10, 11వ శతాబ్ధాలలో కుసుమ శ్రేష్టి సుమారు 18 పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవారు,
ఆయన,ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు.
శివుని (నాగేశ్వర స్వామి) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది.
వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు.
రాజ్యానికి వారసులు లేక వారు చింతిచేవారు.
ఎన్ని ప్రార్థనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు.
అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా, వారికి దశరథుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు.
శ్రేష్టికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పనిచేసాయి.
తన పక్షంలో కేవలం కొంత మంది మాత్రమే ఉన్నప్పటికి, తన కూతురిని రాజుకి ఇచ్చి ఎట్టి పరిస్థితులలోను పెళ్ళి చేయ రాదని నిశ్చయానికి వచ్చాడు.
ఈ సంఘటనతో వైశ్యుల ఐకమత్యం దెబ్బతింది, రాజు మాత్రం దెబ్బతిన్న పాములా పగపట్టి, తన శత్రువులను తుదముట్టించడానికి, తన సమస్త సేనలను కూడదీసుకుని సంసిద్ధం అయ్యాడు.
ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వారు ఆయత్తమవుతున్నారు.
*వాసవి దేవి ప్రతిస్పందన🙏*
వాసవి ప్రవేశించి, అందరిని ఉద్దేశించి ఈ విధంగా అంది – ” *ఒక అమ్మాయి కోసం మనం అంతా రక్తం ఎందుకు చిందించాలి? మన స్వార్ధం కోసం సైనికుల జీవితాలని ఎందుకు అర్పించాలి? యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం*…
దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం, అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాము.
“దృడ సంకల్పం, పట్టుదల ఉన్న వారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొన గలరు”. వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించడి నడవడానికి నిర్ణయించుకున్నారు.
*ఆత్మ బలిదానం🔥*
వాసవి సూచనలను అనుసరించి, గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజబటులు 103 అగ్ని గుండాలను ఏర్పాటు చేసారు.
నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది, అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు.
వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి, తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు.
*ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి – నేను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని చెప్పింది*…
ధర్మాన్ని నిల్పేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధునుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలి యుగంలో జన్మించానని చెప్పింది.
సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితి మంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను అని చెప్పింది.
కుశుమ శ్రేష్టి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని, ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు.
అందుకే మీ అందరిని కూడా ఆత్మ బలి దానానికి పురి కొల్పాను అని అంది.
ఆమె అక్కడ చేరిన వారికి దేశ భక్తి, నిజాయితి, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరించింది.
*విష్ణువర్ధనుడి మరణం*
ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షం అయింది.
అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తల్చుకుని అగ్ని గుండంలో దూకారు.
విష్ణు వర్ధునుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికి తన సేనతో పెనుగొండ పొలిమేరల్లో ప్రవేశించాడు, అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకి చెప్పారు.
ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది.
రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించాడు.
వాసవి చేసిన ఆత్మ త్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది.
విష్ణు వర్ధనుడి చర్యలను ఖండించి, ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి, ఆమె అనుచరులను కొనియాడారు.
*శ్రీ వాసవి దేవి వారసత్వం*
ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజ రాజ నరేంద్రుడు హుటా హుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని విలపించాడు.
ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు…
“సోదరా, గతం నేర్పిన అనుభవాలు పాటంగా భవిష్యత్తును నిర్మించుకుందాం”…
“మహా రక్తపాతం జరగకుండా వాసవి మన అందరిని రక్షించింది, ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది.”
ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయ వంటి అనేక పుణ్య క్షేత్రాలను దర్శించాడు.
పెనుగొండ పుణ్య క్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా శివ లింగాలని ప్రతిష్ఠించాడు…
స్వస్తి🙏🌺
*_🦜శుభమస్తు🦜_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏