🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 14 – 05 – 2025,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
బహుళ పక్షం,
తిథి : *విదియ* రా12.27 వరకు,
నక్షత్రం : *అనూరాధ* ఉ10.23 వరకు,
యోగం : *శివం* పూర్తి,
కరణం : *తైతుల* ఉ11.40 వరకు,
తదుపరి *గరజి* రా12.27 వరకు,
వర్జ్యం : *సా4.27 – 6.11,*
దుర్ముహూర్తము : *ఉ11.29 – 12.21,*
అమృతకాలం : *రా2.52 – 4.36,*
రాహుకాలం : *మ12.00 – 1.30,*
యమగండం : *ఉ7.30 – 9.00,*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 5.32,
సూర్యాస్తమయం: 6.19,
*_నేటి మాట_*
*జీవితంలో ఏది ముఖ్యం ? – దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి??*
ఈ ప్రపంచములో మనకు ఎందరో బంధుమిత్రులు, లెక్కలేనన్ని సంపదలు, భూములు, జాగలు, ఆస్తులు ఉండనివ్వండి..
వీటన్నింటి కన్నా మనము భగవంతుడికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి!!…
ఇహలోక సంపదలు అన్నీ బంధాలను కలిగించడానికే, తప్ప తొలగించడానికి కాదు..
దేవుని నిమిత్తము దేనినైనా వదులుకోవడానికి సిద్ధపడి ఉండాలి.
బాగా ఆలోచించి చూడండి! నేడు కాకున్నా ఇంతకు మునుపు ఎప్పుడో ఒక కష్ట సమయములో బంధుమిత్రులు ఎవరూ ముందుకు రాని సమయములో సమస్య నుండి ఎట్లా గట్టెక్కారో , ఆ సమస్య నుండి ఎవరు మిమ్మలని కాపాడారో తెలుసుకోండి.
ఇక ముందు కూడా జీవితంతో ఒంటరి పోరాటాలు చేయవలసి ఉంటుంది, అప్పుడు కూడా ఆ భగవంతుడే దిక్కు అవుతాడు.
కనుక అన్నింటి మీదా ఎప్పుడూ కూడా ఆయనకే ప్రాముఖ్యత ఇవ్వండి, అప్పుడే ఆయన తోడు నీడై వెన్నంటి నిలుస్తాడు.
*_🌺శుభమస్తు🌺_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏