🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 21 – 05 – 2025,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
బహుళ పక్షం,
తిథి : *నవమి* రా10.38 వరకు,
నక్షత్రం : *శతభిషం* మ2.51 వరకు,
యోగం : *వైధృతి* రా8.57 వరకు,
కరణం : *తైతుల* ఉ11.26 వరకు,
తదుపరి *గరజి* రా10.38 వరకు,
వర్జ్యం : *రా8.58 – 10.30,*
దుర్ముహూర్తము : *ఉ11.30 – 12.21,*
అమృతకాలం : *ఉ7.51 – 9.25,*
రాహుకాలం : *మ12.00 – 1.30,*
యమగండం : *ఉ7.30 – 9.00,*
సూర్యరాశి : వృషభం,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 5.30,
సూర్యాస్తమయం: 6.21,
*_నేటి మాట_*
*ఎల్లపుడు భగవంతుడు తోడు నీడై వెన్నంటి ఉండాలంటే ఏమి చేయాలి??*
ఆ అనుభవం రావాలి, నాకు ఎల్లప్పుడూ తోడు నీడై వెన్నంటి ఉండాలంటే మూడు విధములైన విషయములు స్మరించుకుంటూ వుండాలి!!…
1, నీవు ఎక్కడున్నాసరే అవసరమైన వారికి సేవ చేస్తూ వుండాలి,
ఇతరులకు సాయపడేందుకు లభించిన అవకాశలను వదులుకోకూడదు,
ఇంకొకరి దుఖాన్ని, బాధను, ఇబ్బందిని, తొలగించడానికి మన శక్తి యుక్తులన్నీ వినియోగించాలి,
2, రెండవది నీవెక్కడ వున్నా, ఏమిచేస్తున్నా నీ సాధనను వదులుకోవద్దు.
వాయిదా వేయవద్దు, ఆధ్యాత్మికం కానీ, జపం, ధ్యానం, నామసంకీర్తనం కానీ, దానిని కొనసాగిస్తూనే వుండాలి,
3, మూడవది, చాలా ముఖ్యమైనది … ప్రతీ పనిలో, ప్రతీ విషయం లో …
” ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, ఏ వేళ నైనా ఆ భగవంతుడు నాతోనే ఉన్నాడనే విషయం మరువ రాదు…”
అప్పుడు ఆ భగవంతుడు నీ తోడు నీడై వెన్నంటి తప్పక ఉంటాడు…
*_🌺శుభమస్తు🌺_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏