సీఎస్‌కేపై రాజస్థాన్ ఘన విజయం…

IPL..ఐపీఎల్‌-2025 సీజన్‌ను రాజస్తాన్ ఘన విజయంతో ముగించింది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది..188 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేదించింది.

రాజస్తాన్ బ్యాటర్లలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్‌(41), ధ్రువ్ జురెల్‌(31 నాటౌట్‌), జైశ్వాల్‌(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సీఎస్‌కే బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్‌, నూర్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

సీఎస్‌కే బ్యాటర్లలో ఆయూష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్‌(42), శివమ్ దూబే(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్‌, యుధ్వీర్ సింగ్ చరక్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. దేశ్‌పాండే, హసరంగా తలా వికెట్ సాధించారు. కాగా ఇరు జట్లు కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నిష్క్రమించాయి.

ధోనీకి పాదాభివందనం చేసిన వైభవ్ సూర్య..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో 14 ఏళ్ల రాజస్థాన్ కుర్రాడు వైభవ్ సూర్య వంశీ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాడు…

రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ ఎంఎస్ ధోని కాళ్లను మొక్కాడు. వైభవ్ ధోని కాళ్లు మొక్కుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఐపీఎల్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత, రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేస్తున్నప్పుడు, ధోనీ, వైభవ్ ఎదురెదురుగా వచ్చారు. ధోని దగ్గరగా రాగానే, వైభవ్ కరచాలనం చేయడానికి బదులుగా ఆయన కాళ్లు మొక్కాడు. ధోని వైభవ్ వైపు చూస్తూ నవ్వాడు. వైభవ్ ధోని కాళ్లు మొక్కడం అక్కడున్నవారందర్నీ ఆకట్టుకుంది. వైభవ్ కు పెద్దలు అంటే ఎంత గౌరవం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు….

ఎలిమినేట్ అయిన చెన్నై, రాజస్థాన్ రాయల్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మొదటిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలిమినేట్ గా.. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఇంటి దారి పట్టింది. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్లు ఆడి కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. మొత్తం 10 మ్యాచ్లలో దారుణంగా ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. అటు రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచులలో 10 ఓటమిపాలైంది. నాలుగింట గెలిచింది రాజస్థాన్ రాయల్స్…