🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🍃పంచాంగం🍃
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 28 – 07 – 2025,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
శ్రావణ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *చవితి* రా11.52 వరకు,
నక్షత్రం : *పుబ్బ* రా7.04 వరకు
యోగం : *పరిఘము* తె5.06 వరకు
కరణం : *వణిజ* ఉ11.39 వరకు,
తదుపరి *భద్ర* రా11.52 వరకు,
వర్జ్యం : *రా2.43 – 4.25,*
దుర్ముహూర్తము : *మ12.31 – 1.22,*
మరల *మ3.05 – 3.56*
అమృతకాలం : *మ12.23 – 2.03,*
రాహుకాలం : *ఉ7.30 – 9.00,*
యమగండం : *ఉ10.30 – 12.00,*
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : సింహం,
సూర్యోదయం : 5.40,
సూర్యాస్తమయం: 6.32,
*_నేటి విశేషం_*
*శ్రావణ సోమవారం / దుర్వా గణపతి వ్రతం / నాగ చతుర్ధి / ఆండాళ్ తిరునక్షత్రం*
శ్రావణ సోమవార వ్రతంలో ఆదిదంపతులైన శివపార్వతులను పూజిస్తారు.
పురాణాలననుసరించి సోమవారపు వ్రతాలు మూడు రకాలుగా ఉన్నాయి.
సోమవారం , పదహారు సోమవారాలు , సౌమ్య ప్రదోష్. అన్ని వ్రతాలలాగే ఈ సోమవారపు వ్రతం పాటించాలి.
శ్రావణమాసంలో ఈ సోమవారపు వ్రతాన్ని పాటిస్తే చాలా శుభాలు కలుగుతాయని పురాణాలు చెపుతున్నాయి.
శ్రావణ సోమవారపు వ్రతాన్ని సూర్యోదయానికి ముందు ప్రారంభించి సాయంత్రం వరకు పాటిస్తుంటారు.
శివుని పూజ చేసిన తర్వాత సోమవారపు కథను వినడం తప్పనిసరి.
వ్రతాన్ని పాటించేవారు రోజుకు ఒకపూట మాత్రమే భోజనం చేయాల్సి ఉంటుంది.
శ్రావణ సోమవారపు వ్రతాన్ని పాటించే వారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రనుపక్రమించి స్నానపానాదులు పూర్తి చేసుకోవాలి.
ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని గంగాజలాన్ని లేదా పవిత్రమైన నీటిని ఇంట్లో చల్లాలి.
ఇంట్లోనే మీకు నచ్చిన చోట లేదా పూజగదిలో శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయండి లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోండి.
పూజాదికార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ మంత్రం పఠిస్తూ సంకల్పం చేసుకోండి.
*’మమ క్షేమ స్థైర్య విజయారోగ్యైశ్వర్యాభివృద్ధయర్థం సోమవ్రతం కరిష్యే ‘*
ఆ తర్వాత క్రింది మంత్రాన్ని ధ్యానించండి…
*”ధ్యాయేన్నిత్యంమహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నాకల్పోజ్జవలాంగ పరశుమృగవరాభీతిహస్తం ప్రశన్నం I*
*పద్మాసీనం సమంతాత్స్తుతమమరగణైర్వ్యాఘ్రకృతిం వసానం విశ్వాద్యం విశ్వవంద్యం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రమ్ II “*
ధ్యానం తర్వాత *”ఓం నమఃశివాయ”* తో శివునికి మరియు *”ఓం నమఃశివాయై”* తో పార్వతీదేవిని షోఢశోపచారాలతో పూజించండి. పూజ పూర్తయిన తర్వాత వ్రతానికి సంబంధించి కథను వినండి. ఆ తర్వాత భోజనం లేదా ఫలహారం సేవించండి.
శ్రావణ సోమవారపు వ్రతాన్ని నియమానుసారం పాటిస్తే ఆదిదంపతులైన శివపార్వతుల కృపాకటాక్షాలు లభిస్తాయి. జీవితం ధన్యమవుతుంది. ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంటాయి. భక్తుల కష్టాలు హరింపబడుతాయని పురాణాలు చెపుతున్నాయి.
*_🍃శుభమస్తు🍃_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏