నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 02 – 08 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
శ్రావణ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *అష్టమి* ఉ5.49 వరకు,
నక్షత్రం : *విశాఖ* పూర్తి
యోగం : *శుభం* ఉ6.12 వరకు,
కరణం : *బవ* తె5.49 వరకు,
తదుపరి *బాలువ* రా6.51 వరకు,

వర్జ్యం : *ఉ9.35 – 11.22,*
దుర్ముహూర్తము : *ఉ5.42 – 7.24,*
అమృతకాలం : *రా8.15 – 10.01,*
రాహుకాలం : *ఉ9.00 -10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 5.42,
సూర్యాస్తమయం: 6.30,

*_నేటి మాట_*

_ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా…_
*నీకు నిజమైన మిత్రులు ఎవరు ???*
నిజమైన మిత్రులు ఎవరు అని అనుకున్నప్పుడు, బాధలు పడేటువంటి వారు, దు:ఖములో ఉన్నటువంటి వారు, నిరాశ లోపల ఏవిధమైనటువంటి ఆధారము లేనటువంటి నిరారాధంలో ఉండేటటువంటి వారు అని చెప్పాలి!!…
ఇలాంటి వారే మనకు నిజమైనటువంటి మిత్రులుగా మనము భావించి, వారికి తగినటువంటి యొక్క సహాయమును మనము అందించడానికి పూనుకోడంలో అతి శ్రధ్ధను వహించాలి.

చాలా మంది ధనమున్నవారితో మనము ఫ్రెండ్ షిప్ చేసుకోడం వలన చాలా లాభం కలుగుతుంది అని చెబుతారు,
అందువలన మనకు వచ్చేటువంటి పెద్ద ఇది కాదు.

అందరి యందు, అందరితో ఫ్రెండ్ షిప్ ఉండవలసిందే, కానీ ధనమున్నటువంటివారితో నీవు ఫ్రెండ్ షిప్ చేసుకున్నప్పుడు ఏదో ఒక సమయం లోపల 10 రూపాయలు నీవు అడగ వలసి వస్తుంది.
10 రూపాయలు అడిగినప్పుడు నీ ఫ్రెండ్ షిప్ కట్అయిపోతుంది, నీకు ఇక మొహం చూపించడు, చూస్తే అడుగుతాడేమో ఏమో అని తాను వేరైపోతాడు.

కనుక ఎవ్వరితోనైన కూడను మనము మిత్రులు కావలసిందే, కానీ నిజమైన మిత్రులు ఎవరంటే నీ సేవను అందుకోవటానికి ఎవరు పూనుకుంటారో వారే నీ మిత్రులుగా భావించుకోవాలి.

*_🌸శుభమస్తు🌸_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏