నేటి పంచాంగం.. నేటి మాట..!

ఓం శ్రీ గురుభ్యోనమః .
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 02 – 09 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
భాద్రపద మాసం,
శుక్ల పక్షం,

తిథి : *దశమి* రా12.36 వరకు,
నక్షత్రం : *మూల* రా7.59 వరకు,
యోగం : *ప్రీతి* సా4.02 వరకు,
కరణం : *తైతుల* ఉ11.57 వరకు,
తదుపరి *గరజి* రా12.36 వరకు,

వర్జ్యం : *సా6.15 – 7.59,*
దుర్ముహూర్తము : *ఉ8.17 – 9.07,*
మరల *రా10.50 – 11.37,*
అమృతకాలం : *మ1.03 – 2.47,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : ధనుస్సు,
సూర్యోదయం : 5.48,
సూర్యాస్తమయం: 6.13,

*_నేటి మాట_*

*” ఎట్టి సంకల్పమో అట్టి ఫలితం”*
మానవుడు ఏమి సంకల్పించినా భగవంతుడు “తధాస్తు! తధాస్తు! ” అని ఆశీర్వ దిస్తూ ఉంటాడు.
ఈ సత్యాన్ని మానవుడు అసలు గుర్తించలేడు, భగవంతుని నుండి మానవుడు దేనినీ దాచలేడు, మన ఆలోచనలు కూడా, ఆయనకు తెలుస్తాయి, ఎందువలనంటే ఆయన సర్వత్రా నిండి యున్నాడు కనుక …

మీరు మంచి సంకల్పాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అపుడే తాను మంచి ఫలితాలు పొందగలడు.
చెడు, స్వార్థ పూరిత ఆలోచనల నుండి చెడ్డ ఫలితాలే ప్రాప్తిస్తాయి.

మానవుడు తన సంకల్పము మంచిగా ఉన్నదా, లేదా, అని విచారణ చేయడు కానీ, ఏదైనా చెడ్డ ఫలితాన్ని అనుభవింప వలసి వచ్చినప్పుడు మాత్రం ” భగవంతుడు “నాకెందుకిట్టి ఫలితము నిచ్చాడు? “అని బాధ పడతాడు.
అది తన సంకల్ప దోషమేమైన గానీ, భగవంతుని దోషము కాదు.

*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏