నేటి పంచాంగం.. నేటి విశేషం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 18 – 11 – 2024,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,

తిథి : తదియ రా10.04 వరకు,
నక్షత్రం : మృగశిర రా7.27 వరకు,
యోగం : సిద్ధం రా9.34 వరకు,
కరణం : వణిజ ఉ10.45 వరకు,
తదుపరి విష్ఠి రా10.04 వరకు,

వర్జ్యం : తె3.43 – 5.17,
దుర్ముహూర్తము : మ12.07 – 12.52,
మరల 2.22 – 3.06,
అమృతకాలం : ఉ10.55 – 12.28,
రాహుకాలం : ఉ7.30 – 9.00,
యమగండం : ఉ10.30 – 12.00,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.09,
సూర్యాస్తమయం: 5.21,

*_నేటి విశేషం_*

*నేటీ నక్షత్రం , తిథి, వారం, అన్నీ చాలా విశిష్ట మైనవి – నేడు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతంచేసిన ఎంతో పుణ్యఫలం*

కార్తీక మాసం…ఎంతో శ్రేష్ట‌మైన మాసం.
ఈ మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు ఒక వత్తిని ఉపయోగించడం కూడదని.. కార్తీక దీపంలో రెండు వత్తులు కలిపి రెండు రెండుగా వేయడం లేదా మూడు వత్తులు కలిపి వేయాలని పండితులు చెప్తున్నారు.

ఆ వత్తులు, తామర నార, అరటినార వంటివి ఉపయోగించాలి.
అలాగే కార్తీక మాసంలో విశిష్టమైన రోజులలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేయడం వలన ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్ర వచనం.

ఈ మాసంలో అభిషేకాలు, బిల్వ అర్చన, స్తోత్ర పారాయాణాలు,శివ నామ స్మరణలు ఎంతో మేలు చేస్తాయి.

కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో లేదా ఏదైనా శుభ దినాన సాయంకాలం కానీ, ఉదయం కానీ శుచిగా స్నానమాచరించి.. బ్రాహ్మణులను, బంధుమిత్రాదులను రప్పించి, దేవాలయంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, సముద్రతీరాన కానీ, నదీతీరాన కానీ, స్వగ్రహమునకానీ, పుణ్యక్షేత్రములందు సత్యనారాయణ వ్రతం చేయించాలి.

పూజా స్థలాన్ని గోమయముచే శుద్ధిచేయాలి, తూర్పుగా బియ్యం, చూర్ణము, పసుపు, కుంకుమలతో ముగ్గులు పెట్టి, మంటపము గావించి, మామిడాకుల తోరణములతో సుందరముగా అలంకరించి పూజాద్రవ్యములు రాగిపాత్ర నూతన వస్త్రాలు, కొబ్బరికాయ, పూజా స్థలము నందు ఉంచాలి.

భక్తితో దీపారాధన చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి.
ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కష్టనష్టాలు తొలగిపోతాయి.
ధనధాన్యాలకు లోటుండదు, సౌభాగ్యకరమైన సంతానం, సర్వత్రా విజయం లభిస్తుంది.

*_☘️శుభమస్తు☘️_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏