🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 21 – 11 – 2024,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,
తిథి : షష్ఠి రా8.36 వరకు,
నక్షత్రం : పుష్యమి రా7.44 వరకు,
యోగం : శుక్లం సా4.42 వరకు,
కరణం : గరజి ఉ8.36 వరకు,
తదుపరి వణిజ రా8.36 వరకు,
వర్జ్యం : లేదు,
దుర్ముహూర్తము : ఉ9.54 – 10.39,
మరల మ2.21 – 3.06,
అమృతకాలం : మ1.11 – 2.50,
రాహుకాలం : మ1.30 – 3.00,
యమగండం : ఉ6.00 – 7.30,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 6.12,
సూర్యాస్తమయం: 5.20,
*_నేటి మాట_*
*‘న సుఖాల్లభతే సుఖం’*
చీకటి లేకపోతే కాంతికి విలువ లేదు.
ఆకలి లేకపోతే అన్నానికి విలువ లేదు.
వేడి లేకపోతే ఎయిర్ కండీషనర్ను ఎవరూ ఆశించరు.
*దీనిని పురస్కరించుకొనియే ‘న సుఖాత్ లభతే సుఖం’ అన్నారు*…
సుఖము చేత మనకు సుఖము లభించదు, కష్టము చేత, దుఃఖము చేత సుఖము మనకు ప్రాప్తిస్తుంది.
ఇరువది నాలుగు గంటలూ ఎయిర్ కండీషన్డ్ రూములో మనము కూర్చుంటే దాని విలువను మనము లెక్కచేయము.
రెండు గంటలు ఎండ లోనికి పోయి వచ్చి తిరిగి ఎయిర్ కండీషన్డ్ రూములో కూర్చున్నప్పుడు దాని విలువ మనకు అర్థమవుతుంది, కాబట్టి, మానవ జీవితము సుఖ దుఃఖాలతో కూడిన విచిత్రమైన చరిత్ర.
లాభనష్టములతో, శీతోష్ణములతో కూడిన జీవితమగుట వలన ఈ రెండు భావములు లేకపోతే, అనగా ద్వైతమే లేకపోతే అద్వైతానికి విలువ లేనట్లుగా ఉంటుంది.
*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏