నేటి పంచాంగం….

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 22 – 12 – 2024,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం,

తిథి : *సప్తమి* మ3.13 వరకు,
నక్షత్రం : *పుబ్బ* ఉ7.41 వరకు,
యోగం : *ఆయుష్మాన్* రా8.44 వరకు,
కరణం : *బవ* మ3.13 వరకు,
తదుపరి *బాలువ* తె4.09 వరకు,

వర్జ్యం : *మ3.34 – 5.19*,
దుర్ముహూర్తము : *సా3.59 – 4.43*,
అమృతకాలం : *రా2.05 – 3.50*,
రాహుకాలం : *సా4.30 – 6.00*,
యమగండం : *మ12.00 – 1.30*,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : సింహం,
సూర్యోదయం : 6.30,
సూర్యాస్తమయం: 5.27,

*_నేటి పాశురం_*

_*తిరుప్పావై – 7వ పాశురము*_

_*కీశు కీశెన్రెఙ్గుమానై చ్చాత్తఙ్గలన్దు !*_
_*పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే !*_
_*కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేర్తు*_
_*వాశ నరుఙ్గుళ లాయిచ్చియర్; మత్తినాల్*_
_*ఓశైప్పడుత్త త్తయిర రవమ్ కేట్టిలైయో*_
_*నాయకప్పెణ్పిళ్లాయ్ ! నారాయణన్ మూర్తి*_
_*కేశవనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో*_
_*తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్.*_

_*తాత్పర్యము:–*_

భరద్వాజపక్షులు పగలువిడిపోదుము కదా యని తెల్లవారుజామున కలసికొని అన్నివైపులా ఏవేవో మాటలాడుకొనుచున్నవి. ఆమాటలలోని ధ్వనినైననూ నీవు వినలేదా!
ఓ పిచ్చిదానా! కుసుమాలంకృతమగు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులు గల గోపికలు, కవ్వములతో పెరుగు చిలుకునపుడు, వారిచేతుల కంకణధ్వనులు, మెడలోని ఆభరణ ధ్వనులతో కలసి, విజృంభించి, ఆకాశము నంటుచున్నవి. ఆ ధ్వనిని వినలేదా! ఓ నాయకురాలా! సర్వపదార్థములలో వాత్సల్యముతో వ్యాపించియుండి, మనకు కన్పడవలెననిమూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి, విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును, నీవు పరుండియుంటివా! నీ తేజస్సు మాకు కన్పట్టుచున్నది. దాని నడ్డగింపక మేము దర్శించి యనుభవించునట్లుతలుపు తెరవవలయును.

*_🌻శుభమస్తు🌻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏