🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 07 – 01 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
శుక్ల పక్షం,
తిథి : *అష్టమి* సా4.33 వరకు,
నక్షత్రం : *రేవతి* సా6.23 వరకు,
యోగం : *శివం* రా12.07 వరకు,
కరణం : *బవ* సా4.33 వరకు,
తదుపరి *బాలువ* తె3.22 వరకు,
వర్జ్యం : *ఉ7.12 – 8.41 వరకు*,
దుర్ముహూర్తము : *ఉ8.48 – 9.31*,
మరల *రా10.48 – 11.40*,
అమృతకాలం : *సా4.09 – 5.38*,
రాహుకాలం : *మ3.00 – 4.30*,
యమగండం : *ఉ9.00 – 10.30*,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 6.36,
సూర్యాస్తమయం: 5.36,
*_నేటి పాశురం_*
_*తిరుప్పావై ఇరవై మూడో రోజు పాశురం*_
*23. వ పాశురం*
*మారి మలై* *ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గుమ్*
*శీరియు శిఙ్గ మఱివిత్తు త్తీ విళిత్తు*
*వేరి మయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దు దఱి*
*మూరి నిమిర్ న్దు* *ముళఙ్గిప్పుఱప్పట్టు*
*పోదరు మాపోలే , నీ* *పూవైప్పూవణ్ణా ! ఉన్*
*కోయిల్ నిన్ఱిఙ్గనే* *పోన్దరుళి , కోప్పుడైయ*
*శీరియ* *శిఙ్గాసనత్తిరున్దు , యామ్ వన్ద*
*కారియమారాయ్ న్దరుళే లో రెమ్బావాయ్.*
*భావం:-*
*వర్షా కాలములో చలనము లేకుండ పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని , తీక్షణమైన తన చూపులతో నలుదిశలా పరికించినట్లును , పరిమళముగల తన జూలునిక్కబొడుచునట్లు అటునిటు దొర్లి , లేచి తన శరీరమును బాగుగ సాగదీసి , ఒళ్లు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి , గుహనుంచి రాజఠీవితో బయటకు వచ్చిన విధంగా అతసీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామీ ! నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి , మనోహరంగా అలంకరింపబడిన యీ దివ్య సింహాసనమును అలంకరించవలె ! అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలె ! ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలె !’* అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియజేసింది.
*అవతారిక:-*
*’మమ్మల్ని కటాక్షింపవయ్యా !’* అని ఎంత వేడినా పలుకకున్నవానిని చూచి , నీళాదేవి నాశ్రయించి ఆమె ద్వారా తన్ను చేరదామని యత్నిస్తున్న గోపికలు పడే శ్రమను చూచిన స్వామి *’అయ్యో ! వీరినెంత బాధపెట్టితిని . వీరికి ముందుగనే , నేను కావలసినవి యిచ్చి వుండవలసినది. అని ఎంతో కలత చెందాడు , ‘నావారినే నేను ఉపేక్షించాను. దినులై అర్ధించేటట్లు చేశానని’* ఎంతో బాధపడిన స్వామికి రామాయణ కాలంలో రాక్షసులనుంచి మునులను కాపాడటంలో ఆలసించిన ఘట్టం మనసులో మెదిలింది. ఆనాడు వారిని కష్టపేట్టినట్లుగానే నేడు యీ గోపకన్యలను కష్టపెడితినని కలత చెందాడు స్వామి. వెంటనే *’మీకేమికావలె’* నని అడిగాడు. తప్పక మీ మనోభీష్టాన్ని తీరుస్తానన్నాడు. *’మాకే కోరికలు లేవు స్వామీ ! నీవు నీ భవనము నుండి వచ్చి యీ సింహసనమున వేంచేయగా నీ సౌందర్యమును చూడగోరుదుమ’* నిరి . అదే యీ (పాశురంలో) వర్ణితము.
*23. వ మాలిక*
*(అసావేరి రాగము _ అదితాళము)*
ప.. రారా ! మా స్వామి రారా !
తీరుగ మముజూచి కృపసేయగ రార !
రార ! మా స్వామి రారా !
అ.ప.. లేర ! శయన గృహమును వీడి రావేర !
వర సింహసనమును జేర రావేర !
చ…. గిరి గుహల శయనించి మేల్కొను సింహమై _ కే
సరముల విదిలించి నలుదెసలు పరికించి
గర్జించి అలసత __ విసర్జించి ఆరుదేరు
వీర సింహము వోలె వేవేగ రావేర’
చ.. అతసీ సుమము వంటి తిర మేనుగల స్వామి
ఈ తడవు నీశయన మందిరము వీడవే !
పూత సింహాసన మ్మధివసింపగ రావె !
ఆశ్రితుల మనవి విని కరుణింపగ రావె !
*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏