లేటెస్ట్ న్యూస్.

కిమ్స్‌ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్‌కి షరతులతో అనుమతి.!

హైదరాబాద్‌: కిమ్స్‌ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్‌కి షరతులతో అనుమతి ఇచ్చిన పోలీసులు.. అల్లు అర్జున్‌ వచ్చే విషయం కూడా రహస్యంగా ఉండాలని తెలిపిన పోలీసులు.. ముందస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటాం.. సమాచారం ఇవ్వకుండా వస్తే పూర్తి బాధ్యత మీదే అంటూ నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు.. కిమ్స్‌ ఆస్పత్రికి ఎప్పుడు రావాలనుకున్నా సమాచారం ఇవ్వాలని నోటీసులు…!.

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత..

మెదక్‌లో 7.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
పటాన్‌చెరులో 11, రాజేంద్రనగర్‌లో 11 డిగ్రీలు
ఆదిలాబాద్‌లో 11.2, హకీంపేట్‌లో 14.3 డిగ్రీలు
నిజామాబాద్‌లో 15.2, దుండిగల్‌లో 15.3 డిగ్రీలు
హైదరాబాద్‌లో 15.9, హనుమకొండలో 16 డిగ్రీలు.

ఉత్తరాదిని వణికించిన భూకంపం.

ఢిల్లీ-NCR ప్రాంతంలో తీవ్ర ప్రకంపనలు
బిహార్‌లోని కొన్ని జిల్లాల్లో భూ ప్రకంపనలు
పాట్నాలో ఉదయం 6.40కి కంపించిన భూమి..

రాజ్యాంగం రాసిన అంబేద్కర్ పై కనీస మర్యాద లేకుండా వ్యవహారించారు……….వి హనుమంతరావు మాజీ ఎంపీ……..

2019 జులై లో మరో అంబేద్కర్ విగ్రహం 7లక్షల ఖర్చుతో తెస్తే గోషామహల్ స్టేడియంలో విగ్రహాన్ని బంధించారు……………

గోషామహల్ స్టేడియంలో ఉన్న అంబేద్కర్ విగ్రహన్ని తిరిగి ఎక్కడైనా పెట్టుకోవటానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది………..

మొదట విగ్రహాన్ని ఓల్డ్ సిటీ లో పెట్టాలనుకున్నాం.కానీ అక్కడి నాయకులు కోపరేట్ చెయ్యట్లేదు…………

వి హనుమంతరావు మాజీ ఎంపీ గాంధీభవన్ లో ఏర్పాటుచేసిన” పాత్రికేయుల” సమావేశంలో ఆయన మాట్లాడుతూ……..

అంబర్పేట్ చౌరస్తా లోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను. ఆవిష్కరణ కు సీఎం రేవంత్ రెడ్డి నీ ఆహ్వానిస్తా………..

అంబర్పేట్ చౌరస్తాలోనే పూలె విగ్రహం పక్కన అదే అంబేద్కర్ విగ్రహం పెడతాను……………

వచ్చే అంబేద్కర్ జయంతి నాటికీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాము……….

అంబేద్కర్ ను అవమానించిన బీజేపీ నేతలను తిరగనివ్వద్దు……

ఆర్ .ఎస్. ఎస్. వాళ్ళు రెచ్చగొట్టి ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలనీ చూస్తున్నారు…….

ఈ దేశం సెక్యూలర్ దేశం…….

ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడ హనుమంత రావు ఉంటాడు……….

అంబేద్కర్ కు అవమానం చేసిన అమిత్ షా పెద్ద నాయకుడు ఇలా అవుతాడు………

పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ కి అవమానం జరిగిన తెలంగాణ బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదు…అమిత్ షా మీద కేసు పెట్టే వరకు మా పోరాటం కొనసాగుతుంది……….బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వడం లేదని మాట్లాడుతున్నారు కానీ.. అమిత్ షా మాట్లాడిన మాటలపై ఎందుకు స్పందించడం లేదు………..

*_తెలంగాణ ఓటర్ల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి..!!_*

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓటర్ల జాబితా ను తాజాగా ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925 గా ఉండగా అందులో పురుషు ఓటర్ల సంఖ్య 1,66,41,489 గా ఉంది.

అలాగే రాష్ట్రంలో మహిళా ఓటర్లు 1,68,67,735 మంది ఉంటె.. థర్డ్ జండర్ ఓటర్లు మాత్రం 2,829 మంది ఉన్నారు.

అదే విధంగా రాష్ట్రంలో యువ ఓటర్లు అంటే 18 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్లు 5,45,026 మంది ఉన్నారు. అలాగే సీనియర్ ఓటర్లు అనగా.. 85 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 2,22,091 గా ఉంది. ఇక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఓవర్సీస్ అంటే NRI ఓటర్ల సంఖ్య 3,591 గా ఉంది. అదే విధంగా PWD ఓటర్లు 5,26,993 మంది ఉన్నారు. అయితే రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి. అక్కడ 7,65,982 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా భద్రాచలం 1,54,134 మంది ఓటర్లతో ఉంది…

*🔹మ.2 గంటలకు ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్*

_• ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించనున్న ఈసీ.._

_• ఫిబ్రవరి 15తో ముగియనున్న ప్రస్తుత అసెంబ్లీ.._

_• ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు.._

_ఇప్పటికే పలు నియోజకవర్గాలకు..అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్…

*నేపాల్ లో 7.1 భూకంపం నమోదు*

హైదరాబాద్: జనవరి 07
మంగళవారం ఉదయం నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.1గా నమోదైనట్టు తెలిసింది,

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు లబుచేకు 93 కి.మీ దూరం లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనల ప్రభావం భారత్‌లోని ఉత్త రాది రాష్ట్రాలపై కూడా కనిపించింది.

దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దిల్లీ, పశ్చిమ బెంగాల్,బిహార్‌ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. భూకంపం భూకంప కేంద్రం గోకర్ణేశ్వర్‌కు సమీపంలో ఉందని అంటున్నారు.

భారీ భూకంపం.. 32 మంది మృతి..!

ఇవాళ ఉదయం నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.

పలుచోట్ల భవనాలు నేలమట్టమయ్యాయి.

ఇప్పటి వరకు 32 మృతదేహాలను వెలికితీశారు.

మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం వద్ద రైతు భరోస పోస్టర్లు

“కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్” పేరుతో పోస్టర్లు

రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి 15000 రూపాయలు చొప్పున ఇస్తామని ప్రకటించి, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం, ఇటీవల సీఎం రేవంత్ యూటర్న్ తీసుకుంటూ ఎకరాకు 15000 ఇవ్వమని ప్రకటించడంపై ఏకంగా ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం వద్ద వెలసిన పోస్టర్లు.