అదీ నాలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలతో నలుగురు డాక్టర్లు అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ క్రమంలో వీళ్ల వద్ద నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలు, రైఫిళ్లు, పిస్టల్స్, విషపదార్థాలు (రిసిన్, అమ్మోనియం నైట్రేట్) స్వాధీనం చేసుకున్నారు…అయితే ఈ పరిణామం చోటు చేసుకున్న గంటల వ్యవధిలోనే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం గమనార్హం.
డాక్టర్ల అరెస్టుతో బయటపడిన అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్ వెలుగు చూసింది. ఢిల్లీ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అధ్యాపకుడు డా. ముజమ్మిల్ షకీల్, జమ్ము కశ్మీర్‌కు చెందిన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, గుజరాత్లో డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఉత్తర ప్రదేశ్ సహారన్పూర్లో ఓ మహిళా డాక్టర్‌ను అరెస్ట్ అయిన వాళ్లలో ఉన్నారు. జమ్ము కశ్మీర్, ఫరీదాబాద్ పోలీసు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో ఈ నలుగురు పట్టుబడ్డారు. డాక్టర్లను ఎవరూ అనుమానించరనే ఉద్దేశంతో వాళ్లు ఉగ్ర సంస్థలకు టచ్‌లో ఉంటూ.. దాడులకు ప్రణాళికలు రచించినట్లు నిర్ధారణ అయ్యింది.
వీళ్లు జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ ఘజ్వతుల్ హింద్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు తేలింది. ఇంటర్నేషనల్ హ్యాండ్లర్లు వీళ్లను ప్రభావితం చేశారని స్పష్టమవుతోంది. అంతేకాదు.. వీళ్లలో ఇద్దరు 2018-2021 మధ్య కాలంలో కశ్మీర్లో గాయపడిన ఉగ్రవాదులకు చికిత్స అందించినట్లు తేలింది. దీంతో.. ఇంటెలిజెన్స్ విభాగాలు ఈ మాడ్యూల్‌ను మరింత లోతుగా పరిశీలిస్తున్నాయి. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఉగ్రదాడిగా అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో.. వీళ్లు పట్టుబడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైట్ కాలర్ టెర్రరిజం..
ఇలా ప్రొఫెనల్ వృతుల్లో ఉంటూ ఉగ్రవాదం వైపు మళ్లడమే వైట్ కాలర్ టెర్రరిజం. మేధావులు, విద్యావంతులు, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం లేదంటే.. ఆ చర్యలకు పరోక్షంగా సహకరించడం చేస్తుంటారు. జైష్-ఎ-మొహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, అన్సార్ ఘజ్వతుల్ హింద్ వంటి సంస్థలు ఈ మద్దతుతో లబ్ధి పొందుతున్నాయి. అలా దీని మూలాలు భారత్‌లోనూ గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 1990 తర్వాత ఇది గణనీయంగా పెరిగింది. టెక్నాలజీ, గ్లోబలైజేషన్.. విద్యావంతుల మధ్య ధోరణి మార్పుల కారణంగా ఇది పెరిగిపోతోంది. సైబర్ టెర్రరిజం, ఫైనాన్షియల్ మద్దతు, బయో టెర్రరిజం వంటి ఆధునిక రూపాలను సంతరించుకుంటోంది..
2500 కిలోల అమ్మోనియం నైట్రేట్ సంబంధిత పేలుడు పదార్థాలు..!
2900 కిలోల ఐఈడీ తయారీ పదార్ధాలు స్వాధీనం..
దేశ రాజధాని ఢిల్లీ(Delhi) సమీపంలో ఉగ్రవాదులకు(Terrorists) సంబంధించిన ఆయుధాలు భారీఎత్తున లభ్యమయ్యాయి. హరియాణాలోని ఫరిదాబాద్(Faridabad)లో 2500 కిలోల అమ్మోనియం నైట్రేట్ సంబంధిత పేలుడు పదార్థాలు(2500 Kg of Explosives), ఒక రైఫిల్ సహా 20 టైమర్లను స్వాధీనం చేసుకున్నట్టు స్థానిక పోలీస్ కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా(Police Commissioner Satender Kumar Gupta) వెల్లడించారు…
ఉగ్రసంస్థ పోస్టర్లు అంటించడంతో వెలుగులోకి..
శ్రీనగర్‌లో(Srinagar) అక్టోబర్ 27న జైష్-ఎ-మహమ్మద్(Jaish E Mohammad) ఉగ్రవాద సంస్థకు మద్దతుగా పలు పోస్టర్లు వెలిశాయి. వీటిని కశ్మీర్‌కు చెందిన వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్(Adil Ahmed Rather) వేసినట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు పసిగట్టారు. సదరు వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ సహరాన్‌పుర్‌లోని ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతణ్ని గతవారం అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నిందితుడు గతేడాది అక్టోబర్ ముందువరకూ అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విధులు నిర్వర్తించాడని, అక్కడ అతని లాకర్‌ను తనిఖీ చేయగా ఒక రైఫిల్ దొరికిందని తెలిపారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారమే ఫరిదాబాద్‌లో ఈ రికవరీ జరిగినట్టు వెల్లడించారు.
నిందితుడు రాథర్ చెప్పిన ప్రకారం.. ముజామ్మిల్ షకీల్(Muzammil Shakil) అనే మరో డాక్టర్ వద్ద కూడా పేలుడు పదార్థాలు, ఆయుధ సామాగ్రి నిల్వ ఉన్నట్టు తేలింది. దీంతో పుల్వామాకు చెందిన షీకల్‌నూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు ఫరిదాబాద్‌లోని ఆల్-ఫలాహ్ ఆస్పత్రి(Al-Falaj Hospital)లో పనిచేస్తున్నాడు..
హర్యానా లోని ఫరీదాబాద్‌లో డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ అల్ ఫలాహ్ యూనివర్శిటీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఢిల్లీకి 45 కిమీ దూరంలో హర్యానా లోని ధోజ్‌లో ఈ యూనివర్శిటీ ఉంది.
ప్రైవేట్‌గా నడుపుతున్న ఈ యూనివర్శిటీకి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉంది. ముజమ్మిల్ అహ్మద్ అద్దె నివాసంపై ఆదివారం రాత్రి దాడి చేసి భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్‌లో జేషే మహమ్మద్ పోస్టర్లు వేసిన కేసులో కూడా ముజమ్మిల్ వాంటెడ్‌గా ఉన్నాడు. ఆయన నుంచి 360 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు ఫరీదాబాద్ పోలీస్ కమీషనర్ సతేందర్ గుప్తా వెల్లడించారు. అది ఆర్డిఎక్స్ కాదని, కానీ అమోనియం నైట్రేట్ కావచ్చని చెప్పారు. ఇవి కాక ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడానికి 20 టైమర్లు, బ్యాటరీలతో నాలుగు టైమర్లు, ఐదు కిలోల మెటల్, వాకీ టాకీ సెట్, బ్యాటరీలు, రైఫిల్, మూడు మ్యాగజైన్లు, మరో 83 తూటాలు, 8 తూటాలతో ఉన్న పిస్టోలు, రెండు ఖాళీతూటాలు, స్వాధీనం అయ్యాయన్నారు. 8 పెద్ద సూట్‌కేసులు, నాలుగు చిన్న సూట్‌కేసులు, బకెట్ ధౌజ్ లోని ఆయన గది నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్‌లో అరెస్టు కాగా, మరో నిందితుడు ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్పూర్ నుంచి జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారని కమిషనర్ గుప్తా వెల్లడించారు. జమ్ము కశ్మీర్ పోలీస్ అధికార ప్రతిని ధి వివరాల ప్రకారం అక్టోబర్ 19న శ్రీనగర్ లోని బన్‌పొరా నౌగామ్ ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలను లక్షం చేసుకుని జైషే మహమ్మద్ పోస్టర్లు వెలిశాయి. దర్యాప్తులో ఉగ్రవాద భావజాలం కలిగిన విద్యార్థులు, ప్రొఫెసర్‌తోకూడిన ఓ ఉగ్రవ్యవస్థ వెలుగు చూసింది. పాకిస్థాన్ తదితర దేశాల నుంచి పనిచేసే ఉగ్రమూకలతో వీరికి సంబంధాలు ఉన్నాయి. సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులో వీరు నిధులు సేకరించడం, తీవ్ర వాద భావజాలాన్ని పేరేపించడం, ఉగ్రవాద సంస్థల్లో చేర్పించడం తదితర కార్యకలాపాలు సాగిస్తున్నారని బయటపడింది. భద్రతా దళాలు మరికొందరిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్మగ్లింగ్ చేయడం ఈ ముఠా చర్యల్లో భాగంగా ఉంటోంది. ఆయుధాల చట్టం లోని సెక్షన్లు 7,25 కింద, చట్టవిరుధ్ధ కార్యకలాపాల నివారణ ఉపా చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు..