హైదరాబాద్లో పలుచోట్ల దంచికొట్టిన వర్షం.!
హైదరాబాద్ లొ పలు ప్రాంతాల్లో భాారీ వర్షం కురిసింది. భాగ్యనగరంతో పాటు నగర శివార్లలోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కొండాపూర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లిలో వర్షం దంచికొట్టింది. సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమై హైదర్నగర్, ఆల్విన్ కాలనీ, కేపీహెచ్బీకాలనీ ప్రాంతాలను వాన ముంచెత్తింది..
మద్యం మత్తులో స్విమ్మింగ్పూల్లో దిగి యువకుడు మృతి (వీడియో)
AP: విశాఖ జిల్లా పద్మనాభం మండలం కురపల్లిలోని పండుగ నాడు విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో స్విమ్మింగ్పూల్లో దిగి యువకుడు మృతి చెందాడు. రోహిత్ అనే యువకుడు పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రైవేటు రిసార్ట్లోతన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. పార్టీలో మద్యం తాగి స్విమ్మింగ్పూల్లోకి దిగిన అభిషేక్ వంశీ.. స్విమ్మింగ్ చేయలేక మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
*LPG Cylinder | సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..!!*
న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్యులపై మరో భారం మోపింది. పెట్రో ధరలు తగ్గుతాయంటూ లీకులిస్తూ వస్తున్న బీజేపీ సర్కార్..
గ్యాస్ సిలిండర్ (LPG cylinder) ధరను మాత్రం పెంచింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిండర్పై మరో రూ.62 బాదింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1802కు చేరింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర జోలికి మాత్రం వెల్లకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.
కమర్షియల్ సిలిండర్ ధర పెంపు..
తాజా పెంపుతో హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2028కి పెరిగింది. కోల్కతాలో రూ.1911.50, ముంబైలో రూ.1754.50, చెన్నైలో రూ.1964.50గా ఉన్నది. కాగా, వాణిజ్య అవవసరాలకు వినియోగించే సిలిండర్ ధర గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.
ఇక డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.803గా ఉండగా కోల్కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50, విజయవాడలో రూ.827.50గా ఉన్నది. హైదరాబాద్లో మాత్రం పై అన్ని నగరాల్లో కంటే అత్యధికంగా రూ.855కు లభిస్తున్నది..
ఎప్పుడూ ఇంత కష్టం అనిపించలేదు. వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోయాయి.. సిఎం చంద్రబాబు..
శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రిని అయ్యా అని కార్యకర్తలతో అన్నారు. చరిత్రలో హైయస్ట్ స్ట్రైకింగ్ రేటు కొట్టామని చెప్పారు. ఇచ్ఛాపురం నుండి గుంటూరు వరకు రెండే ఓడిపోయామన్నారు. ఇది ఓ చరిత్ర అని చెప్పారు. ఈ చరిత్ర వెనుక కార్యకర్తల త్యాగాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు..ఎప్పుడూ రానంత విజయం వచ్చిందంటే.. ప్రజలు ఎంత ఫ్రస్టేషన్ లో ఉన్నారో తెలుస్తుంది. మీకంటే 10 రెట్లు ఎక్కువ ఆశతో ప్రజలు ఉన్నారు. నా దగ్గర మంత్ర దండం ఉందనుకుంటున్నారు. ఎప్పుడూ ఇంత కష్టం అనిపించలేదు. వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోయాయి. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశారు. హాస్పిటల్, రెవెన్యూ కార్యాలయాలన్నీ తాకట్టు పెట్టారు. నేను ఏ జిల్లాకు వచ్చినా కార్యకర్తలను కలవకుండా పోను. భుజాలు అరిగేలా మోశారు. కొందరు పార్టీకి పని చేశారు. కొందరు చేయలేదు.
దివాలా దిశాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు..
Fake promises) తో ప్రజలను మభ్యపెట్టడానికే పరిమితమైందని, ఇప్పుడు ప్రజలు కూడా గ్రహించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. అమలు చేయడానికి ఆసాధ్యమని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం వెంబడి ప్రచారం హామీలు గుప్పిస్తూనే ఉందని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ఇస్తున్న హామీలు ఎప్పటికీ నెరవేరమనే విజయం ప్రజల ముందు బహిర్గతమైందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి రెండూ దెబ్బతిని, మరింత అధ్వాన్న స్థితిలోకి జారిపోతున్నాయని వరుస ట్వీట్లలో మోదీ విమర్శలు గుప్పించారు..కాంగ్రెస్ పార్టీ అసాధ్యం కాని హామీలు తేలిగ్గా ఇవ్వడం నేర్చుకుంది. తాము ఇచ్చే హామీలు ఎప్పటికీ నెరవేరని తెలిసి కూడా ఒక ప్రచారం తరువాత మరో ప్రచారంలో తప్పుడు హామీలు ఇస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రజల ముందు వారి డొల్లతనం బయటపడింది” అని మోదీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఈరోజు పరిస్థితి చూస్తే ఆర్థిక ఆరోగ్యం, అభివృద్ధి పథం అనేవి దయనీయ పరిస్థితికి చేరుకున్నాయని చెప్పారు. హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. ఇది ఆయా రాష్ట్ర ప్రజలను దారణంగా మోసగించడమేనని చెప్పారు. కాంగ్రెస్ రాజకీయాలకు పేదలు, యువకులు, రైతులు, మహిళలు బాధితులుగా మారానని, చివరకు అమలులో ఉన్న పథకాలను కూడా నీరుగారిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ తప్పుడు హామీల సంస్కృతి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హర్యానా ప్రజలు ఇటీవలే కాంగ్రెస్ పార్టీ డొల్ల హామీలను తిప్పికొట్టి సుస్థిర ప్రభుత్వం కోసం బీజేపీని మూడోసారి గెలిపించారని మోదీ గుర్తుచేశారు..
2009 ఎన్నికలు అయిపోయాక తన జీవితం అగమ్యగోచరంగా అనిపించింది..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2009 ఎన్నికలు అయిపోయాక తన జీవితం అగమ్యగోచరంగా అనిపించిందని, ఏంచేయాలో తెలియలేదని వ్యాఖ్యానించారు. అప్పుడు ఐఎస్ జగన్నాథపురం గ్రామానికే వచ్చానని, ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చి స్వామివారిని వేడుకున్నానని పవన్ వెల్లడించారు.
తండ్రీ… నాకు ప్రజల కోసం పనిచేసే శక్తిని ప్రసాదించమని స్వామివారిని ప్రార్థించానని తెలిపారు. కానీ స్వామి తనకు 14 ఏళ్ల పరీక్ష పెట్టాడని… మొదటి ఎన్నికల్లో ఓడిపోయామని తెలిపారు. దాంతో భవిష్యత్ అంధకారంలా మారిపోయిందని, జీవితంలో చిమ్మచీకటి నెలకొందని పేర్కొన్నారు. అయితే, 14 ఏళ్ల కిందట ఇక్కడి ఆలయంలో వెలిగించిన దీపం ఫలితం ఇటీవలి ఎన్నికల్లో కనిపించిందని పవన్ వివరించారు. ఇవాళ రాష్ట్రానికే కాదు, దేశంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అండగా నిలబడే శక్తిని, ధైర్యాన్ని ప్రజలతో పాటు ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి ఇచ్చారని వెల్లడించారు. .
టీటీడీ పాలకమండలిలో మరికొందరికి చోటు.!
బీఆర్ నాయుడు ఛైర్మన్గా 24 మందితో ఏర్పాటైన టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం మరో ఐదుగురికి చోటు కల్పించింది. జి.భాను ప్రకాశ్ రెడ్డిని సభ్యుడిగా, దేవదాయ శాఖ సెక్రటరీ, కమిషనర్, TUDA ఛైర్మన్, TTD ఈవోలను ఎక్స్అఫిషియో మెంబర్లుగా పాలకమండలిలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది…
తెలంగాణలో ఆరు గ్యారంటీలు ప్రకటించినప్పుడు బడ్జెట్ గుర్తుకురాలేదా?.. కేటిఆర్.
గాలి మాటల గ్యారంటీలిస్తే మొదటికే మోసం వస్తుందని AICC ఛైర్మన్ మల్లికార్జున ఖర్గేకు ఇప్పుడు అర్థమైనట్లు ఉందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కర్ణాటక, తెలంగాణలో ఆరు గ్యారంటీలు ప్రకటించినప్పుడు బడ్జెట్ గుర్తుకురాలేదా? అని ఆయనను నిలదీశారు. ‘కాంగ్రెస్ ఆడిన గ్యారంటీల గారడీతో రాష్ట్రం ఆగమైంది. ప్రజలను గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన మోసం క్షమించరానిది’ అని ఆయన ట్వీట్ చేశారు..బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా అని ఖర్గేను ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా అని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు.. ఈ విషయాలు ఎందుకు గుర్తుకురాలేదని ప్రశ్నించారు. ఏవీ చూసుకోకుండా.. కేవలం అధికారమే లక్ష్యంగా.. కాంగ్రెస్ ఆడిన గ్యారెంటీల గారడీతో.. తెలంగాణ రాష్ట్రం.. ఏడాదిలోనే ఆగమైందని విమర్శించారు.
తెలంగాణ ప్రజలను నమ్మించి.. నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పదేళ్లపాటు ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణను అడ్డగోలు హామీలతో మభ్యపెట్టినందుకు తప్పు ఒప్పుకోవాలన్నారు. అనాలోచితంగా ఇచ్చే కాంగ్రెస్ గ్యారెంటీలతో.. భవిష్యత్ తరాలకు కూడా నష్టం జరుగుతుందని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషమని అన్నారు. కానీ.. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మిన పాపానికి.. ఏడాదికాలంగా తెలంగాణకు జరిగిన నష్టం పూడ్చలేనిదని వ్యాఖ్యానించారు. గ్యారెంటీల మాటున కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిదని స్పష్టం చేశారు..
తెలంగాణ సచివాలయం భద్రత బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) స్వీకరణ..!
హైదరాబాద్: తెలంగాణ సచివాలయం భద్రత బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) స్వీకరించింది. ఎస్పీఎఫ్నకు చెందిన 214 మంది ఈ రోజు నుంచి సచివాలయం భద్రత బాధ్యతలు చేపట్టారు.
గేట్లు, ఇతర ప్రాంతాల్లో సాయుధ గార్డు, లోపల గస్తీ వంటి బాధ్యతలను ఎస్పీఎఫ్నకు ప్రభుత్వం అప్పగించింది. ఎస్పీఎఫ్ కమాండెంట్ దేవీదాస్ నేతృత్వంలో భద్రత సిబ్బంది ఇవాళ సచివాలయం ఆవరణలో పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు.
సచివాలయం ప్రారంభించిన తర్వాత మొదట్లో ఎస్పీఎఫ్ భద్రత నిర్వహించింది. గతేడాది ఏప్రిల్ 25న భద్రత నిర్వహణను తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ)కు అప్పగించారు. అయితే భద్రతతోపాటు అగ్నిప్రమాదాల నుంచి రక్షణ వంటి పలు అంశాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన ఎస్పీఎఫ్నకు సచివాలయం భద్రత బాధ్యతలు అప్పగించాలని ఆగస్టు 5న ప్రభుత్వానికి డీజీపీ ప్రతిపాదించారు. డీజీపీ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం భద్రత బాధ్యతలను టీజీఎస్పీ నుంచి తీసుకోవాలని ఎస్పీఎఫ్ను ఆదేశించింది…
*విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తీక మాసోత్సవాలు*
ఏపీలో విజయవాడ లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిదేవస్థానంలో కార్తీక మాసోత్సవాల నిర్వహణకు
ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ మల్లేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో సహస్ర లింగార్చన, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, ఆకాశ దీపోత్సవాన్ని
నిర్వహిస్తారు. ప్రత్యేకంగా స్వామికి బిల్వార్చన, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కోటి దీపోత్సవం, జ్వాలా తోరణం, మాస శివరాత్రి వంటి పర్వదినాలను విశేషంగా నిర్వహిస్తారు. ఆలయం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు..
USA.
పేలిపోయిన బ్యాటరీ కంపెనీ...
అమెరికాలోని మిస్సోరీలో లిథియం అయాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది, ఘటనా స్థలికి చేరుకుని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బ్యాటరీ వాహనాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది….