హార్దిక్ పాండ్యా తర్వాత భారత జట్టుకు అత్యుత్తమ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా నితీష్…గవాస్కర్.

అఫ్గానిస్తాన్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు..మూడు ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్యా తర్వాత భారత జట్టుకు అత్యుత్తమ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా నితీష్ ఎదుగుతున్న తీరుపై బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. “నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతమైన భవిష్యత్ ఉన్న ఆటగాడు. ఐపీఎల్ తొలి సీజన్ ఆరంభంలో అతడు కేవలం బ్యాటర్ మాత్రమే. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే ముందు అతడి బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుండేది. అయితే ఆ సీజన్ చివరి మ్యాచ్‌ల్లో అతడు వేసిన కొన్ని ఓవర్లే అతడిలో ఒక నాణ్యమైన ఆల్‌రౌండర్ దాగి ఉన్నాడని నిరూపించాయి” అని తాజా చర్చలో గవాస్కర్ తెలిపాడు.

భారత జట్టు భవిష్యత్తు కోసం వెంకటేష్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గేలను కూడా ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దాలని గవాస్కర్ సూచించాడు. “వీరిద్దరూ ఎంతో ప్రతిభావంతులు. వారిని హడావుడిగా జట్టులోకి తీసుకురాకుండా తగిన సమయం ఇచ్చి తీర్చిదిద్దాలి. విఫలమైనప్పుడు మద్దతుగా నిలవాలి. జట్టులో ప్రధానంగా బ్యాటర్లుగా ఉండే ఆటగాళ్లు బ్యాటర్ ఆలోచనా ధోరణిలోనే ఉంటారు. కానీ వారు బౌలింగ్‌ను కూడా సీరియస్‌గా తీసుకుని బౌలర్లలా ఆలోచించడం మొదలుపెడితే భారత జట్టుకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి” అని పేర్కొన్నాడు.