ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తనకు ఇచ్చిన ఆఫర్పై బిహార్ (Bihar) ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish Kumar) స్పందించారు..తాను తిరిగి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
”మా కంటే ముందు అధికారంలో ఉన్న వారు ఎలాంటి అభివృద్ధి చేశారు..? అప్పుడు స్త్రీల పరిస్థితి ఎలా ఉండేది..? సూర్యాస్తమయం తర్వాత ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు ప్రజలు భయపడేవారు. నేను పొరపాటున అలాంటి వారితో రెండు సార్లు పొత్తు పెట్టుకున్నాను. తప్పు చేశా” అని నీతీశ్ వ్యాఖ్యానించారు. కాగా.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో నీతీశ్ కుమార్ కీలక పాత్ర వహించారు.