శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండకముందే పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్కు 6 టీఎంసీల నీటిని తరలిస్తుంటే సీఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రులు మౌనం…మాజీ ఎమ్మెల్యే నోముల భగత్.
నల్గొండ జిల్లా:
శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండకముందే పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్కు 6 టీఎంసీల నీటిని తరలిస్తుంటే సీఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రులు మౌనంగా ఉండటమేంటని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ప్రశ్నించారు.
హాలియాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నిండాలని వరుణ యాగం చేస్తూనే మరోవైపు నీటిని తరలించడం ఎంతవరకు సమంజసమన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి మిగులు జలాలను మాత్రమే తరలించాలని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని నోముల భగత్ హెచ్చరించారు.