‘ఓ బటర్‌ఫ్లై’ మూవీ.. ఓటీటీలోకి..!

ప్రస్తుతం వెండితెరపై థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. అందులోనూ మనిషిలోని మానసిక సంఘర్షణలను, రహస్యాలను ఇతివృత్తంగా తీసుకుని వచ్చే ‘సైకలాజికల్ థ్రిల్లర్స్’కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ సైకలాజికల్ థ్రిల్లర్‌కు రొమాంటిక్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే.. ఆ కోవకే చెందుతుంది ‘ఓ బటర్‌ఫ్లై’ మూవీ.

విభిన్నమైన కథాంశం
ఇటీవలే కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ఓ బటర్‌‌ఫ్లై సినిమాకు డైరెక్టర్ విజయ్ రంగనాథన్ కథ, దర్శకత్వం వహించారు. ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను థియేటర్లలో అలరించింది ఈ సినిమా. రీసెంట్‌గా థియేట్రికల్ రన్‌ను ముగించుకుని ఓ బటర్‌‌ఫ్లై ఓటీటీలోకి వచ్చేసింది.

కథా నేపథ్యం ఇదే..
ఓ బటర్‌‌ఫ్లై సినిమాలో గౌరీ (నివేదితా సతీష్) అనే యువతి పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. గౌరీకి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) ఉంటుంది. తన గతం గురించి ఒక లోతైన రహస్యాన్ని తన భర్తకు చెప్పాలని భావించిన ఆమె, అతడిని ఒక మారుమూల హిల్ స్టేషన్‌లోని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్తుంది గౌరీ..।

నూతన వధూవరులైన అర్జున్, గౌరీ పెళ్లి తర్వాత కొడైకనాల్‌కు వస్తారు; అతను అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడంతో కుంగిపోయి ఉంటాడు. అతని స్నేహితుడైన సూర్యపై తనకు పెళ్లికి ముందు ఉన్న ప్రేమను ఒప్పుకోవాలా వద్దా అని గౌరీ సతమతమవుతుంది. అనుకోని భేటీ సూర్యను ఇంటికి తీసుకురావడంతో, ఆమె ఆవేదన మరింత తీవ్రమవుతుంది. నిజం బయటపడి, వారి బంధం నిలబడుతుందా లేదా అనేది చివరి ఘట్టంలో వెల్లడవుతుంది.