ఒకే వ్యక్తికి 3 రాష్ట్రాల్లో ఓటు..

లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం.. ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ (BJP) గెలుపు కోసం ఎన్నికల సంఘం పనిచేస్తుందని తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయంటూ..ఢిల్లీలోని ఇందిరా భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ (Press conference) నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి ప్రాంతాల్లో వేలాది నకిలీ ఓట్లను చేర్చారని, ఇందుకు ఎన్నికల సంఘం (Election Commission) సహకరించిందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో ఆదిత్య శ్రీవాస్తవ అనే ఓటర్ (voter Aditya Srivastava) మూడు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నాడని చూపిస్తూ.. అతని ఫోటో ఎపిక్ నెంబర్ సహా పూర్తి వివరాలను ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చూపించాడు.

అయితే రాహుల్ గాంధీ ఆరోపించిన వ్యక్తి సడెన్ గా ప్రత్యక్షమయ్యాడు. అతను మీడియా ముందుకు వచ్చి మూడు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందన్న దానిపై వివరణ ఇచ్చి.. రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చాడు. రాహుల్ గాంధీ ఫేక్ ఓటర్ గా చూపించిన ఆదిత్య శ్రీవాస్తవ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ.. తాను మొదట లక్నోలో ఓటరుని.. 2016 లో ఉద్యోగం కోసం ముంబైకి మారినప్పుడు..అక్కడ నా పేరును ముంబై ఓటరు జాబితాకు రూల్స్ ప్రకారం బదిలీ చేసుకున్నాను. అనంతరం ఉద్యోగ రీత్యా బెంగళూరుకు మారినప్పుడు.. రూల్స్ ప్రకారం తాను తన ఓటును అదే 2021లో బెంగళూరుకు మార్చుకొని ఇక్కడి ఓటరుగా మారాను” “నేను ప్రతిసారి అతని పేరు, చిరునామాను ఆన్‌లైన్‌లో వ్యక్తిగతంగా నవీకరించాను” అని మీడియా సాక్షిగా చెప్పుకొచ్చాడు. దీంతో రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ పై చేసిన ఆరోపణల్లో నిజం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు..