టీడీపీ ఎమ్మెల్యేకి మాజీ మంత్రి, జనసేన నాయకుడు వార్నింగ్ ఒంగోలులో ముదురుతున్న జనసేన vs టీడీపీ వైరం నువ్వు భయపెడితే భయపడేవాడు ఎవడూ లేడు దామచర్ల జనార్దన్ కేవలం ఓట్లు వేయడానికే జనసేన నాయకులు, కార్యకర్తలు పనికొస్తారా? జనసేన కార్యకర్తలకు నేను అండగా ఉంటాను, ఎన్ని కేసులు పెట్టినా భయపడను టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావుకు మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక….
ఒంగోలులో ముదురుతున్న జనసేన–టీడీపీ విభేదాలు.. ఎమ్మెల్యే దామచర్లకు బాలినేని వార్నింగ్
ఒంగోలులో జనసేన–టీడీపీ మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావుపై మా
“నువ్వు భయపెడితే భయపడేవాడు ఎవడూ లేడఅంటూ దామచర్ల జనార్దన్రావును ఉద్దేశించి
జనసేన కార్యకర్తలకు తాను అ
తాజా వ్యాఖ్యలతో ఒంగోలులో అధికార కూటమిలోని జనసేన–టీడీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య ప్రకాశం జిల్లా ఒంగోలులో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావు, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ముదిరింది. తాజాగా ఎమ్మెల్యే దామచర్ల తీరుపై బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలై, ఆ తర్వాత జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఎమ్మెల్యే దామచర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దామచర్ల అరాచకాలు పెరిగిపోయాయి. తానే రాజు, తానే మంత్రి అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన తీరుతో సొంత పార్టీ టీడీపీ కార్యకర్తలే ఇబ్బందులు పడుతున్నారు” అని బాలినేని ఆరోపించారు. తమ వారిపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని, తప్పు చేయని తన వాళ్లను కాపాడుకోలేకపోతే తాను నాయకుడిగా ఉండి ఉపయోగం ఏంటని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేపై నేరుగా అవినీతి ఆరోపణలు చేశారు. “ఇసుక, మైనింగ్, వైన్లో ఎమ్మెల్యేకు వాటాలు ఉన్నాయి. ఆయనకు ప్రతిరోజూ మామూళ్లు అందుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విచారణకు ఆదేశించాలి. అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి” అని బాలినేని డిమాండ్ చేశారు.