గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నివాసం లోక్ భవన్ వద్ద టీవీకే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన..!.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేను పిలవాలి’:- పి. చిదంబరం
తమిళనాడు(Thamilanadu) గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నివాసం లోక్ భవన్ వద్ద టీవీకే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం లోక్ భవన్ ఎదుటు నిరసన తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని టీవీకే అభిమానులు, కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు. మరోవైపు వామపక్షాలు, కాగ్రెస పార్టీ సైతం గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలక పిలుపునిచ్చారు.కాగా, టీవీకే ఈ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు) దక్కలేదు. సొంతంగా 107 స్థానాలు గెలిచిన టీవీకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు చేస్తోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఏకైక పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి అని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. టీవీకే పార్టీ చీఫ్ (TVK) విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ఆ హ్వానించాలని ఎక్స్ వేదికగా గవర్నర్కు సూచించారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాజకీయ కూటమికి లేదా ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించనప్పుడు గవర్నర్ కర్తవ్యం ఏమిటి? శాసనసభ సభ్యుల సంఖ్యాబలం ఆధారంగా, అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఏకైక పార్టీ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలి. ఇది రాజకీయ నియమం అన్నారు. ఇది పార్లమెంటరీ సంప్రదాయం పేర్కొన్నారు. ఆ పార్టీ నాయకుడికి మెజారిటీ మద్దతు ఉందని నిరూపించుకోవాల్సిన వేదిక అసెంబ్లీనే తప్ప గవర్నర్ భవనం కాదు. ఇది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అని గుర్తు చేశారు.