పాకిస్తాన్ చుట్టూ ప్రమాదాలే పొంచి ఉన్నాయి. భారత్తో విభేదాలు, బలూచిస్తాన్తో వేర్పాటు వాదం, ఇవి చాలదు అన్నట్లుగా అఫ్ఘనిస్తాన్తో గొడవలు. పాక్, అఫ్ఘన్ సరిహద్దులో గురువారం ఇరు దేశాల మధ్య కాల్పులు జరిగాయి…ఆఫ్ఘనిస్తాన్లోని బర్మాచా సరిహద్దు ప్రాంతంలో ఇరువర్గాలు పరస్పరం భారీ కాల్పులు జరపడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ ప్రాంతం పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్కు సమాంతరంగా ఉంది. స్థానిక అధికారుల ప్రకారం, సరిహద్దులో కొత్త పోస్టుల నిర్మాణం కారణంగా ఈ వివాదం తలెత్తింది. ఉదయం ప్రారంభమైన కాల్పులు కొంత సమయం తర్వాత ఆగిపోయాయని, కానీ మధ్యాహ్నం తర్వాత మళ్లీ ఫైరింగ్ జరిగింది…
https://x.com/BaluchFighter/status/1928027844820468197?t=mfHLyQj5zfc3sRfPTuLaaQ&s=19
రెండు వైపుల నుండి కాల్పులు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మండ్ ప్రావిన్స్ తాత్కాలిక పరిపాలన అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. పాకిస్తాన్ సైన్యం ట్యాంకులను మోహరించిందని, ఆఫ్ఘన్ సరిహద్దులోని పోస్టులను లక్ష్యంగా చేసుకుని భారీ ఫిరంగిదళాలను ఏర్పాటు చేసిందని వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్, ఆఫ్ఘన్ తాలిబన్లు ఇప్పుడు బద్ధ శత్రువులని ఆయన అన్నారు. పాకిస్తాన్ సైన్య జనరల్స్, ఇప్పటివరకు జరిగిన అన్ని యుద్ధాలలో ఓడిపోయినప్పటికీ, వారి ఛాతీపై చాలా పతకాలతో తిరుగుతారని తెహ్రీక్-ఇ-తాలిబాన్ అనే ఉగ్రవాద సంస్థ ఎద్దేవా చేసింది.